క్వారంటైన్ వ్యక్తులు ధైర్యంగా ఉండండి : కలెక్టర్ నారాయణ రెడ్డి

దిశ, నిజామాబాద్: క్వారంటైన్‌లో ఉన్న కరోనా అనుమానిత వ్యక్తులు ధైర్యంగా ఉండాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్మూర్, పెర్కిట్, బాలకొండ, భీంగల్‌లోని కంటామినెంట్ క్లస్టర్స్, ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తులు ధైర్యంగా ఉండాలని, మీకు అవసరమైన సదుపాయాలను అధికారులు కల్పిస్తారన్నారు. ఆహారం , మెడిసిన్, పండ్లు, పాలు, టీ మొదలగునవి అందిస్తారని వెల్లడించారు. క్వారం టైన్‌లో ఉన్నవారు భౌతిక దూరం […]

Update: 2020-04-10 05:17 GMT

దిశ, నిజామాబాద్: క్వారంటైన్‌లో ఉన్న కరోనా అనుమానిత వ్యక్తులు ధైర్యంగా ఉండాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్మూర్, పెర్కిట్, బాలకొండ, భీంగల్‌లోని కంటామినెంట్ క్లస్టర్స్, ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తులు ధైర్యంగా ఉండాలని, మీకు అవసరమైన సదుపాయాలను అధికారులు కల్పిస్తారన్నారు. ఆహారం , మెడిసిన్, పండ్లు, పాలు, టీ మొదలగునవి అందిస్తారని వెల్లడించారు. క్వారం టైన్‌లో ఉన్నవారు భౌతిక దూరం పాటించాలని, ఎవరి రూమ్‌లో వాళ్లు ఉండాలన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి దగ్గర ఉండటం వల్ల అందరికి ఈ వైరస్ సోకే ప్రమాదముందని కావున, సామాజిక దూరం పాటించాలన్నారు. క్వారంటైన్ లోని వారి శాంపిల్స్ పరీక్షల కోసం పంపించామని, రిపోర్ట్స్ రాగానే నెగిటివ్ ఉన్నవారిని ఇంటికి పంపిస్తామన్నారు. పాజిటివ్ వచ్చిన వారిని తదుపరి ట్రీట్మెంట్ కోసం గాంధీకి తరలిస్తామని చెప్పారు.

ఆర్మూర్‌లోని జిరాయత్ నగర్ ఏరియాలో నిర్వహిస్తున్న హౌస్ హోల్డ్ సర్వే గురించి జిల్లా పాలనాధికారి మెడికల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్మూర్ జీరాయత్ నగర్‌లో కంటామినెంట్ పరిధిలోని ఇంటింటికి వెళ్లి 540 గాను 334మందికి సర్వే పూర్తి చేశామన్నారు. మిగతా వారివి ఈ రోజు పూర్తి చేస్తామని మెడికల్ ఆఫీసర్ కలెక్టర్‌కు వివరించారు. అనంతరం పెర్కిట్ మోడల్ స్కూల్లోని క్వారంటైన్ సెంటర్‌ను నారాయణ రెడ్ది సందర్శించారు. 50 ఏండ్లు పైబడిన బీపీ, షుగర్, గుండె జబ్బులు ఉన్నవారికి కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు పంపించాలన్నారు. తదుపరి భీంగల్‌లోని బాబాపూర్ కంటామినెంట్ క్లస్టర్‌ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. లాక్ డౌన్ అమలవుతున్న తీరును పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాస్, ఎమ్మార్వోలు సంబంధిత అధికారులు ఉన్నారు.

Tags: corona, quarantine, be brave, collector narayana reddy, nizamabad

Tags:    

Similar News