డిసెంబర్ 1 నుంచి నాణ్యమైన బియ్యం
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ సాగుతోంది. ఎన్నికల ప్రచారం సందర్భరంగా జగన్ ఇంటింటికి నాణ్యమైన బియ్యం అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఈ పథకాన్ని డిసెంబర్ 1 నుంచి అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగా వైఎస్సార్ పోషణ, సంపూర్ణ పోషణ పథకానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక జగనన్న విద్యా కానుకు కింద ప్రతి విద్యార్థికి ఏడాదికి మూడు జతల యూనిఫాం, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్ […]
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ సాగుతోంది. ఎన్నికల ప్రచారం సందర్భరంగా జగన్ ఇంటింటికి నాణ్యమైన బియ్యం అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఈ పథకాన్ని డిసెంబర్ 1 నుంచి అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగా వైఎస్సార్ పోషణ, సంపూర్ణ పోషణ పథకానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక జగనన్న విద్యా కానుకు కింద ప్రతి విద్యార్థికి ఏడాదికి మూడు జతల యూనిఫాం, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్ కూడా అందజేయాలని నిర్ణయించింది. వచ్చే సెప్టెంబర్ 5న ఈ పథకానికి జగన్ శ్రీకారం చుట్టనున్నారు.