జనసేన తీర్థం పుచ్చుకున్న వైసీపీ కౌన్సిలర్లు.. పార్టీ ఖాతాలోకి తొలి మున్సిపాలిటీ

వైసీపీ కౌన్సిలర్లు జనసేన తీర్థం పుచ్చుకోవడంతో జనసేన పార్టీ ఖాతాలోకి తొలి మున్సిపాలిటీ చేరింది.

Update: 2025-04-12 13:56 GMT
జనసేన తీర్థం పుచ్చుకున్న వైసీపీ కౌన్సిలర్లు.. పార్టీ ఖాతాలోకి తొలి మున్సిపాలిటీ
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ కౌన్సిలర్లు జనసేన తీర్థం పుచ్చుకోవడంతో జనసేన పార్టీ ఖాతాలోకి తొలి మున్సిపాలిటీ చేరింది. తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) నిడదవోలు మున్సిపాలిటీ (Nidadhavolu Municipality) పరిధిలోని మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మాణం పెట్టాలని ఏప్రిల్ 03న వైసీపీ కౌన్సిలర్లు (YCP Councillers) ఆర్డీవో, కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం 13 మంది కౌన్సిలర్లు సహా పలువురు వైసీపీ నేతలు జనసేన పార్టీ (Janasena Party)లో చేరారు. మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) వారికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

నిడదవోలు మున్సిపాలిటీలో శనివారం ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మాణానికి సరిపడ బలం లేకపోవడంతో తీర్మాణం వీగింది. జనసేన పార్టీలో చేరిన కౌన్సిలర్లతో పాటు టీడీపీ (TDP), ఎక్స్ అఫీషియో సభ్యుల (EX Officio Member)తో కలిపి బలం 15 కు చేరడంతో జనసేన పార్టీ ఖాతాలో చేరిన తొలి మున్సిపాలిటీగా నిడదవోలు మున్సిపాలిటీ చేరింది. ఈ విషయాన్ని మంత్రి కందుల దుర్గేష్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన.. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భావజాలం, మన సారథ్యంలో జరుగుతున్న నిడదవోలు అభివృద్ధి పనులు నచ్చి, మాపై నమ్మకం ఉంచి పార్టీలో చేరిన మున్సిపల్ కౌన్సిలర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Similar News