ఎవరైనా వావ్ అనాల్సిందే..40అడుగుల పీవీ సింధు వాల్‌ ఆర్ట్

దిశ, ఖ‌మ్మం : ఖమ్మం పట్టణానికి చెందిన స్వాతి, విజయ్‌ గోడల మీద ఆర్ట్‌లు వేస్తూ తమ అభిరుచిని చాటుతున్నారు. ఈ మధ్య వారిద్దరు కలిసి ఖమ్మంలోని సర్ధార్‌ పటేల్‌ స్టేడియం గోడపై బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు 40 అడుగుల పెయింటింగ్‌ను వేశారు. దీన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో స్పందించిన పీవీ సింధు వారిని అభినందించారు. ఆ విషయాన్ని ఆమె రీ ట్విట్ చేశారు. అంతేకాకుండా ఆర్ట్‌కు సంబంధించిన ఫొటోల‌ను సింధు కూడా ట్విట్ట‌ర్లో పోస్టు […]

Update: 2020-06-23 11:12 GMT

దిశ, ఖ‌మ్మం :
ఖమ్మం పట్టణానికి చెందిన స్వాతి, విజయ్‌ గోడల మీద ఆర్ట్‌లు వేస్తూ తమ అభిరుచిని చాటుతున్నారు. ఈ మధ్య వారిద్దరు కలిసి ఖమ్మంలోని సర్ధార్‌ పటేల్‌ స్టేడియం గోడపై బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు 40 అడుగుల పెయింటింగ్‌ను వేశారు. దీన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో స్పందించిన పీవీ సింధు వారిని అభినందించారు. ఆ విషయాన్ని ఆమె రీ ట్విట్ చేశారు. అంతేకాకుండా ఆర్ట్‌కు సంబంధించిన ఫొటోల‌ను సింధు కూడా ట్విట్ట‌ర్లో పోస్టు చేశారు. యూట్యూబ్‌లోని వీడియో లింక్‌ను కూడా జ‌త చేసింది. దీంతో నెటిజన్లు లైకులు, కామెంట్లు చేస్తూ స్వాతి, విజయ్‌లను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Tags:    

Similar News