నిన్న ప్రారంభం.. ఈరోజు దాడి..

ఛతీస్‌ఘడ్ సుక్మా జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన

Update: 2024-12-24 04:11 GMT

దిశ,భద్రాచలం : ఛతీస్‌ఘడ్ సుక్మా జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన గోమగూడ క్యాంపుపై నక్సలైట్లు కాల్పులు జరిపారు.క్యాంపు బయటి కార్డాన్‌లో మావోలు కాల్పులు జరుపగా సైనికులు ధీటుగా బదులిచ్చారు.మావోలు బీజీఎల్ (బారెల్ గ్రెనేడ్ లాంచర్)తో దాడి చేయడంతో ఇద్దరు జవాన్లకు గాయాలు అయ్యాయి.నక్సలైట్ గుండెకాయగా పేరొందిన ప్రాంతంలో సైనికులు క్యాంపు ఏర్పాటు చేశారు.కొత్తగా క్యాంపు ఏర్పాటు చేసి 24 గంటలు గడవక ముందే మావోలు దాడి చేయడం విశేషం. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.


Similar News