పంజాబ్‌లో లిక్కర్ హోం డెలివరీ!

ఛండీగడ్: మూడో దశ లాక్‌డౌన్‌లో భాగంగా లిక్కర్ షాపులు ఓపెన్ కాగానే మద్యం ప్రియులు గుంపులు గుంపులుగా వాటి ముందు తచ్చాడారు. సామాజిక దూరాన్ని లెక్కచేయకుండా గుమిగూడారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన పంజాబ్ ప్రభుత్వం.. లిక్కర్‌ను హోం డెలివరీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అందుకు అనుగుణంగా మార్గదర్శకాలను విడుదల చేసింది. లిక్కర్ షాపుల ముందు గుమిగూడకుండా ఐదుగురికి మించి ఉండరాదని ఆదేశాలనిచ్చింది. వీటితోపాటు.. లిక్కర్‌ను హోం డెలివరీ చేసేందుకు అనుమతినిచ్చింది. డెలివరీ […]

Update: 2020-05-06 05:57 GMT

ఛండీగడ్: మూడో దశ లాక్‌డౌన్‌లో భాగంగా లిక్కర్ షాపులు ఓపెన్ కాగానే మద్యం ప్రియులు గుంపులు గుంపులుగా వాటి ముందు తచ్చాడారు. సామాజిక దూరాన్ని లెక్కచేయకుండా గుమిగూడారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన పంజాబ్ ప్రభుత్వం.. లిక్కర్‌ను హోం డెలివరీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అందుకు అనుగుణంగా మార్గదర్శకాలను విడుదల చేసింది. లిక్కర్ షాపుల ముందు గుమిగూడకుండా ఐదుగురికి మించి ఉండరాదని ఆదేశాలనిచ్చింది. వీటితోపాటు.. లిక్కర్‌ను హోం డెలివరీ చేసేందుకు అనుమతినిచ్చింది. డెలివరీ బాయ్స్ అధికారిక పాస్‌లు కలిగి ఉండి వాహనాన్ని రిజస్టర్ చేసుకుని ఉండాలి. ఈ సర్వీసుతో కుటుంబానికి రెండు లీటర్లకు మించిన మద్యం అమ్మరాదన్న నిబంధనను ప్రభుత్వం పెట్టింది. షాపుల దగ్గర ప్రతి ఒక్కరు సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించాలని, ఎంప్లాయిస్‌ కూడా కొంత మంది మాత్రమే ఉండాలని చెప్పారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు లిక్కర్‌‌ షాపులు ఓపెన్‌ చేయాలని, దానికి పర్మిషన్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన మొదటి రాష్ట్రం పంజాబ్ కావడం గమనార్హం.

tags: punjab, home delivery, liquor, excise

Tags:    

Similar News