పంజాబ్, హర్యానా సీఎంల మధ్య వాగ్వాదం

దిశ, వెబ్‌డెస్క్ : రైతుల ఆందోళన నేపథ్యంలో పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రుల మధ్య వాగ్వాదం బద్ధలైంది. ఢిల్లీ, హర్యానా సరిహద్దులో రైతుల ఆందోళనలను పంజాబ్‌లోని కొన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు ప్రోత్సహిస్తున్నాయని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ ఆరోపించారు. దీనిపై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్‌తో చర్చించడానికి మూడు రోజులుగా ఆరేడు సార్లు ఫోన్‌లో ప్రయత్నించారని, కానీ, మాట్లాడలేదని అన్నారు. ఖట్టార్ వ్యాఖ్యలపై పంజాబ్ సీఎం అమరింద్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ఖట్టార్ పచ్చి […]

Update: 2020-11-28 12:11 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రైతుల ఆందోళన నేపథ్యంలో పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రుల మధ్య వాగ్వాదం బద్ధలైంది. ఢిల్లీ, హర్యానా సరిహద్దులో రైతుల ఆందోళనలను పంజాబ్‌లోని కొన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు ప్రోత్సహిస్తున్నాయని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ ఆరోపించారు. దీనిపై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్‌తో చర్చించడానికి మూడు రోజులుగా ఆరేడు సార్లు ఫోన్‌లో ప్రయత్నించారని, కానీ, మాట్లాడలేదని అన్నారు. ఖట్టార్ వ్యాఖ్యలపై పంజాబ్ సీఎం అమరింద్ సింగ్ తీవ్రంగా స్పందించారు.

ఖట్టార్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. అసలు తనకు ఫోన్లే చేయలేదని తెలిపారు. పంజాబ్ రైతులపట్ల హర్యానా ప్రభుత్వం దురుసుగా ప్రవర్తించిన నేపథ్యంలో ఒకవేళ ఇకపై పదిసార్లు ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయబోనని స్పష్టం చేశారు. పంజాబ్ రైతుల పట్ల ఖట్టార్ తప్పుగా వ్యవహరించారని అంగీకరిస్తేగానీ ఆయనను క్షమించబోనని అన్నారు. రైతులపై టియర్ గ్యాస్, లాఠీ చార్జ్ ప్రయోగం చేస్తుండగా వారితో మాట్లాడే మార్గమే లేకుండా పోయిందని వివరించారు.

Tags:    

Similar News