‘పూజా’కు పనికొచ్చే సినిమా

          పూజా హెగ్డే …’ అల వైకుంఠపురంలో’ మూవీ బ్లాక్ బస్టర్‌తో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. స్క్రీన్‌పై తన క్యూట్‌నెస్‌తో ఆకట్టుకున్న ఈ బుట్ట బొమ్మ… వరుసగా క్రేజీ ఛాన్సెస్ కొట్టేస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్‌లో తన హవా నడిపిస్తోంది.           ముఖ్యంగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం రావడంతో ఆనందంతో స్టెప్పులు వేస్తోంది పూజా. సల్మాన్ వీరాభిమాని […]

Update: 2020-02-11 02:17 GMT

పూజా హెగ్డే …’ అల వైకుంఠపురంలో’ మూవీ బ్లాక్ బస్టర్‌తో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. స్క్రీన్‌పై తన క్యూట్‌నెస్‌తో ఆకట్టుకున్న ఈ బుట్ట బొమ్మ… వరుసగా క్రేజీ ఛాన్సెస్ కొట్టేస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్‌లో తన హవా నడిపిస్తోంది.

ముఖ్యంగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం రావడంతో ఆనందంతో స్టెప్పులు వేస్తోంది పూజా. సల్మాన్ వీరాభిమాని అయినా పూజా హెగ్డే… ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంబరపడిపోయింది. 2020 బిగ్ వేలో బిగిన్ అయిందని.. సల్మాన్‌తో నటించడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని పోస్ట్ పెట్టింది. ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ‘కభీ ఈద్ కభీ దివాలి’ టైటిల్ ఖరారు కాగా… సాజిద్ నడియాడ్వాలా నిర్మాత.

ఇక తెలుగులో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్’ సినిమాతో సమ్మర్‌లో అలరించనున్న పూజా … పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మూవీలోనూ హీరోయిన్‌గా ఎంపికైంది. మొత్తానికి 2020లో పూజా కాల్షీట్లు ఫుల్ అయిపోయి… ఫుల్ బిజీ అయిపోయినట్లుంది.

Tags:    

Similar News