పుదుచ్చేరి సీఎంకు కరోనా

చెన్నై: పుదుచ్చేరి సీఎంగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ఏఐఎన్‌ఆర్‌సీ చీఫ్ ఎన్ రంగసామి కరోనా బారినపడ్డట్టు ఆదివారం తేలింది. ఇందిరా గాంధీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ఆయనకు పరీక్ష చేయగా పాజిటివ్‌గా తేలినట్టు ఆరోగ్య శాఖ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నదని, చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స తీసుకోవడానికి నిర్ణయించుకున్నారని తెలిపారు. సాయంత్రమే చెన్నైకి బయల్దేరారు. మేదాంత హాస్పిటల్‌కు ఆజాం ఖాన్ ప్రస్తుతం జైలులో ఉన్న రాంపూర్ […]

Update: 2021-05-09 20:45 GMT

చెన్నై: పుదుచ్చేరి సీఎంగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ఏఐఎన్‌ఆర్‌సీ చీఫ్ ఎన్ రంగసామి కరోనా బారినపడ్డట్టు ఆదివారం తేలింది. ఇందిరా గాంధీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ఆయనకు పరీక్ష చేయగా పాజిటివ్‌గా తేలినట్టు ఆరోగ్య శాఖ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నదని, చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స తీసుకోవడానికి నిర్ణయించుకున్నారని తెలిపారు. సాయంత్రమే చెన్నైకి బయల్దేరారు.

మేదాంత హాస్పిటల్‌కు ఆజాం ఖాన్

ప్రస్తుతం జైలులో ఉన్న రాంపూర్ ఎంపీ, రాష్ట్ర మాజీ మంత్రి, ఎస్పీ నేత ఆజాం ఖాన్, ఆయన కుమారుడు అబ్దుల్లాహ్‌లు కరోనాబారినపడ్డారు. వీరిరువురిని లక్నోలోని మేదాంత హాస్పిటల్‌కు తరలించినట్టు అధికారులు వివరించారు.

Tags:    

Similar News