రేవంత్, బండి సంజయ్‌పై జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ మీద మాట్లాడేవారు మూడు కేటగిరి వాళ్లని ‘‘బ్రోకర్లు.. జోకర్లు.. లోఫర్లు’’ అని రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ అరవింద్‌ను ఉద్దేశించి పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘దళితబంధు’ ప్రపంచంలోనే అత్యుత్తమ పథకమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 17 లక్షల కుటుంబాలకు లక్షా 70 వేల కోట్లు అందజేస్తామని కేసీఆర్ ప్రకటించారని, ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి […]
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ మీద మాట్లాడేవారు మూడు కేటగిరి వాళ్లని ‘‘బ్రోకర్లు.. జోకర్లు.. లోఫర్లు’’ అని రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ అరవింద్‌ను ఉద్దేశించి పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘దళితబంధు’ ప్రపంచంలోనే అత్యుత్తమ పథకమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 17 లక్షల కుటుంబాలకు లక్షా 70 వేల కోట్లు అందజేస్తామని కేసీఆర్ ప్రకటించారని, ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి చేస్తోన్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ‘దళితబంధు’ అమలైతే తమకు పుట్టగతులుండవని ‘జోకర్లు, లోఫర్లు, బ్రోకర్లు’ కేసీఆర్ మీద మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే వ్యక్తి సీఎం కేసీఆర్ అని అభిప్రాయపడ్డారు. మా అందరికీ తల్లిలాంటి శోభమ్మను కూడా రాజకీయాల్లోకి రేవంత్ లాగడం శోచనీయం అన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ బీజేపీ నేతలు తమ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ఓ విజ్ఞాని రేవంత్ ఓ అజ్ఞాని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాజనీతిజ్ఞత ముందు మీరు ఎంత అని నిలదీశారు. దళితబంధు అమలైతే తమ దుకాణాలు బంద్ అవుతాయన్న అక్కసుతోనే రేవంత్, బండి సంజయ్ మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దళిత బంధు తర్వాత కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాలకు టూలేట్ బోర్డు తగిలించుకోవాల్సిందేనన్నారు. బండి సంజయ్ దరఖాస్తుల ఉద్యమం జోక్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అడ్డదిడ్డంగా మాట్లాడి అబాసుపాలు అయింది బండి సంజయ్ అని అన్నారు. స్వర్గంలో దెబ్బతిన్న వాహనాలకు ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తాను అన్న మాట మాట తప్పి జోకర్ పేరు తెచ్చుకున్నాడని ఎద్దేవా చేశారు. మోడీ హామీల గురించి దరఖాస్తు చేసుకోవాలని బండి సంజయ్ కి సూచించారు. రేవంత్ రెడ్డి బయోపిక్ మైండ్ అని అంటే దూరదృష్టి లేని వ్యక్తి అని మండిపడ్డారు. హుజురాబాద్‌లో గెలిచేది టీఆర్ఎస్ అని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ కమీషన్ ఏజెంట్ అని, కమీషన్ల పార్టీ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. అవినీతికి కాంగ్రెస్ కిటికీలు తెరిస్తే బీజేపీ దర్వాజాలు తెరిచిందని ఎద్దేవా చేశారు.