సీజనల్ వ్యాధులను తరిమేద్దాం : కమిషనర్
దిశ, వరంగల్: పరిశుభ్రతను పాటిస్తూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారిద్దామని గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. 47వ డివిజన్ కార్పొరేటర్ నల్ల స్వరూపరాణి అధ్యక్షతన బంజారా కాలనీ వీధుల్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాలు సమయాన్ని వెచ్చించండం వల్ల సీజనల్ వ్యాధులను తరిమి వేయవచ్చన్నారు. 47వ డివిజన్‌లోని ఇంటింటికీ వెళ్లి సీజనల్ వ్యాధులు డెంగ్యూ, చికెన్ […]
దిశ, వరంగల్: పరిశుభ్రతను పాటిస్తూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారిద్దామని గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. 47వ డివిజన్ కార్పొరేటర్ నల్ల స్వరూపరాణి అధ్యక్షతన బంజారా కాలనీ వీధుల్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాలు సమయాన్ని వెచ్చించండం వల్ల సీజనల్ వ్యాధులను తరిమి వేయవచ్చన్నారు. 47వ డివిజన్‌లోని ఇంటింటికీ వెళ్లి సీజనల్ వ్యాధులు డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి వ్యాధులు నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ.. ప్రజలకు, మహిళలకు బల్దియాచే ముద్రించిన కరపత్రాలు, స్టిక్కర్‌లు పంపిణీ చేశారు. ప్రజలు సామాజిక బాధ్యతగా ప్రతి వారం 10 నిమిషాలు కేటాయించి రోగాలు దరిచేరకుండా తమతో పాటు తమ కుటుంబ ఆరోగాన్ని కాపాడుకోవాలన్నారు. ఎవరి ఇంట్లో వాళ్లు ఎయిర్ కూలర్లు, నీటి తొట్టెలు, పూల తొట్టిలు, గాజు సీసాలు, మెటల్ సామాన్లు, రబ్బర్ టైర్లు ఇతర నీరు నిల్వ ఉండే ప్రతి వస్తువును శుభ్రం చేయడం ద్వారా వ్యాధులను అరికట్టొచ్చన్నారు.