పబ్‌జీ బాధ్యతలు మేము చూసుకుంటాం
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం పబ్‌జీ సహా వందల చైనా యాప్‌లను నిషేధం విధించిన నేపథ్యంలో పబ్‌జీ (PUBG)ఫ్యాన్స్‌కు కంపెనీ శుభవార్త తెలిపింది. ఇటీవల మారుతున్న పరిణామాల నేపథ్యంలో పబ్‌జీకి చెందిన మొబైల్, మొబైల్ లైట్ గేమ్‌ల పబ్లిషింగ్ హక్కులను స్వయంగా పర్యవేక్షించనున్నట్టు, తద్వారా చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్ (Tencent Game)తో సంబంధాలను తెంచుకోనున్నట్టు వెల్లడించింది. భారత్‌లో పబ్‌జీ నిషేధంపై గేమ్ రూపొందించిన దక్షిణ కొరియా గేమింగ్ కంపెనీ పబ్‌జీ కార్పొరేషన్ (Pubg Corporation) తాజా […]
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం పబ్‌జీ సహా వందల చైనా యాప్‌లను నిషేధం విధించిన నేపథ్యంలో పబ్‌జీ (PUBG)ఫ్యాన్స్‌కు కంపెనీ శుభవార్త తెలిపింది. ఇటీవల మారుతున్న పరిణామాల నేపథ్యంలో పబ్‌జీకి చెందిన మొబైల్, మొబైల్ లైట్ గేమ్‌ల పబ్లిషింగ్ హక్కులను స్వయంగా పర్యవేక్షించనున్నట్టు, తద్వారా చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్ (Tencent Game)తో సంబంధాలను తెంచుకోనున్నట్టు వెల్లడించింది.
భారత్‌లో పబ్‌జీ నిషేధంపై గేమ్ రూపొందించిన దక్షిణ కొరియా గేమింగ్ కంపెనీ పబ్‌జీ కార్పొరేషన్ (Pubg Corporation) తాజా నిర్ణయం తీసుకుంది. ఈ గేమ్ మొబైల్ వెర్షన్ ప్రమోషన్లను చూసుకుంటున్న చైనా కంపెనీ టెన్సెంట్ గేమ్స్‌తో సంబంధాలను తెంచుకోనున్నట్టు, పూర్తిస్థాయి బాధ్యతలను తామే చూసుకోనున్నట్టు పబ్‌జీ కార్పొరేషన్ ప్రకటించింది. అదేవిధంగా, భారత చట్టాలను, నిబంధనలను పాటిస్తామని, ప్రభుత్వం తీసుకునే చర్యలను గౌరవిస్తామని, ప్రస్తుత సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్చిస్తామని, భవిష్యత్తులో ప్రభుత్వంతో కలిసి పని చేయాలని భావిస్తున్నట్టు పబ్‌జీ కార్పొరేషన్ తెలిపింది. ఈ అంశంపై ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది.