కరోనా..ప్రభుత్వ రుణాలు రూ. 6.45 లక్షల కోట్లు!

దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో సంక్షోభాన్ని ఎదుర్కొన్న ఎమ్ఎస్ఎమ్ఈ, రిటైల్, వ్యవసాయ రంగాలకు మార్చి 1 నుంచి మే 15 మధ్య కాలంలో ప్రభుత్వ బ్యాంకులు రూ. 6.45 లక్షల కోట్ల విలువైన రుణాలను మంజూరు చేసినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. మే 8 వరకు రూ. 5.95 లక్షల కోట్లు ఇచ్చినట్టు తెలిపారు. ట్విటర్‌ వివరాల ప్రకారం..మార్చి 1 నుంచి మే 15 వరకు ఎమ్ఎస్ఎమ్ఈ, వ్యవసాయం, […]

Update: 2020-05-19 08:07 GMT

దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో సంక్షోభాన్ని ఎదుర్కొన్న ఎమ్ఎస్ఎమ్ఈ, రిటైల్, వ్యవసాయ రంగాలకు మార్చి 1 నుంచి మే 15 మధ్య కాలంలో ప్రభుత్వ బ్యాంకులు రూ. 6.45 లక్షల కోట్ల విలువైన రుణాలను మంజూరు చేసినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. మే 8 వరకు రూ. 5.95 లక్షల కోట్లు ఇచ్చినట్టు తెలిపారు. ట్విటర్‌ వివరాల ప్రకారం..మార్చి 1 నుంచి మే 15 వరకు ఎమ్ఎస్ఎమ్ఈ, వ్యవసాయం, రిటైల్, కార్పొరేట్ రంగాల్లోని మొత్తం 54.96 లక్షల ఖాతాలకు రూ. 6.45 లక్షల కోట్ల విలువైన రుణాలను ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చాయి. మే 8 నాటికి ఇచ్చిన రూ. 5.95 లక్షల కోట్లతో పోలిస్తే తక్కువ కాలంలో అధిక రుణాలను ఇచ్చినట్టు నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. అలాగే, మార్చి 20 నుంచి మే 15 మధ్య అత్యవసర రుణ సదుపాయం, మూలధన వనరులను పెంచడానికి రూ.1.03 లక్షల కోట్ల విలువైన రుణాలను ప్రభుత్వ బ్యాంకులు మంజూరు చేశాయి. మే 8కి మంజూరైన రుణాల కంటే రూ. 65,879 కోట్లతో గణనీయమైన పెరుగుదల అని ఆర్థిక మంత్రి వెల్లడించారు.

https://twitter.com/nsitharamanoffc/status/1262607126117011458?s=20

Tags:    

Similar News