ఇన్‌స్టా ఎంగేజ్‌మెంట్.. వాటిలో లైక్స్, కామెంట్స్, షేర్స్‌దే కీరోల్
దిశ, ఫీచర్స్ : ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న సోషల్ మీడియా పోర్టల్‌లలో ఒకటి. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రజలు తమ వ్యాపారాలను అనేక రకాలుగా పెంచుకుంటున్నారు. వ్యాపారం కోసమే ఇన్‌స్టాగ్రామ్‌ని ఉపయోగిస్తుంటే, బ్రాండ్ వాల్యూ పెంచడానికి, ఆన్‌లైన్‌లో ఫాలోవర్స్ ఎంగేజ్‌మెంట్ పెంపొందించడానికి గట్టి ప్రయత్నం చేయాలి. ప్రతి నెలా ఒక బిలియన్ మంది ఇన్‌స్టాగ్రామ్‌ని ఉపయోగిస్తున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌ని రైట్ వేలో ఉపయోగించుకుంటే బిజినెస్‌కు తిరుగుండదు. ఫాలోవర్స్‌కు మించి లైక్స్, కామెంట్స్, షేర్స్ ఉండాలి. అందుకని ‘ఎంగేజ్‌మెంట్ […]
దిశ, ఫీచర్స్ : ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న సోషల్ మీడియా పోర్టల్‌లలో ఒకటి. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రజలు తమ వ్యాపారాలను అనేక రకాలుగా పెంచుకుంటున్నారు. వ్యాపారం కోసమే ఇన్‌స్టాగ్రామ్‌ని ఉపయోగిస్తుంటే, బ్రాండ్ వాల్యూ పెంచడానికి, ఆన్‌లైన్‌లో ఫాలోవర్స్ ఎంగేజ్‌మెంట్ పెంపొందించడానికి గట్టి ప్రయత్నం చేయాలి. ప్రతి నెలా ఒక బిలియన్ మంది ఇన్‌స్టాగ్రామ్‌ని ఉపయోగిస్తున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌ని రైట్ వేలో ఉపయోగించుకుంటే బిజినెస్‌కు తిరుగుండదు. ఫాలోవర్స్‌కు మించి లైక్స్, కామెంట్స్, షేర్స్ ఉండాలి. అందుకని ‘ఎంగేజ్‌మెంట్ గ్రూప్’ లేదా ‘ఎంగేజ్‌మెంట్ పాడ్’ లేదా లైక్‌లను కొనుగోలు చేయడం లేదా అలాంటి వాటి గురించి ఆలోచించడం అనవసరమని గ్రహించాలి. నాణ్యమైన ఎంగేజ్‌మెంట్ కోసం షార్ట్‌కట్ లేదు. ఉత్తమ పోస్ట్‌ని రూపొందించడానికి, సంభాషణను ప్రోత్సహించడానికి, ఫాలోవర్స్‌తో నిజాయితీగా కనెక్ట్ అవ్వడానికి సమయం కేటాయించండి. కచ్చితంగా ఫలితం ఆశాజనకంగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో బలమైన, శాశ్వతమైన ఎంగేజ్‌మెంట్‌ను ఆర్గానిక్‌గా పొందడానికి నిపుణులు కొన్ని చిట్కాలను, మార్గాలను అందిస్తున్నారు.
అభిప్రాయాలను లేదా ఫాలోవర్స్ లెక్కించడం కంటే ఇన్‌స్టా ఎంగేజ్‌మెంట్ ముఖ్యమైంది. ఇది మన కంటెంట్‌తో ప్రేక్షకులతో పరస్పర చర్యలను తూకం వేసే ఓ వెపన్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంగేజ్‌మెంట్‌ను ‘లైక్స్’, కామెంట్స్, లైక్స్, సేవ్స్, ఫాలోవర్స్, గ్రోత్ మెన్షన్స్, బ్రాండెడ్ ష్యాష్‌ట్యాగ్స్, క్లిక్-త్రూ, డీఎమ్ వంటి అనేక కొలమానాల ద్వారా అంచనా వేస్తారు. పోస్ట్‌లకు వచ్చే ఈ ప్రతిస్పందనలు, చర్యలే ప్రజలు కంటెంట్‌ను చూడటంతో పాటు, మనం చెప్పేదానిపై వాళ్లు ఆసక్తి చూపిస్తున్నారనడానికి నిదర్శనం.
ఆడియెన్స్
ఎవరి కోసం కంటెంట్ రూపొందిస్తున్నారో తెలియకపోతే దాన్ని ఉత్తమంగా రూపొందించడం కష్టం. ‘టార్గెట్ ఆడియన్స్’ డెమోగ్రాఫిక్స్ తెలుసుకోవడం వల్ల వారికి ఏ టైప్ కంటెంట్ అందించాలో, ఏ రోజుల్లో, ఏయే సమయాల్లో పోస్ట్ పబ్లిష్ చేస్తే బాగుంటుందో తెలుస్తుంది. ఉదాహరణకు, ఆఫ్‌బీట్ ఇండీ క్లాతింగ్ లేబుల్ ఫ్యాషన్ బ్రాండ్ కంపెనీ ‘బోల్డ్ హ్యుమర్’ ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటుంది. అందుకుతగ్గట్లుగానే ప్రొడక్ట్ ఆఫరింగ్స్, పోస్ట్ టోన్ రెండూ దానిని ప్రతిబింబించేలా ఉంటాయి.
కథే కీలకం
‘స్టోరీ’ విభాగం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇన్‌స్టాలో చాలా మార్పులు వచ్చాయి. సక్సెస్‌ఫుల్ ఇన్‌స్టాగ్రామర్స్ ప్రతిదీ రాయడానికి ప్రయత్నించరు. కేవలం వీడియో రికార్డ్ చేసి ప్రేక్షకులతో మాట్లాడతారు. అదే ఫాలోవర్‌కు, క్రియేటర్‌కు మధ్య నిజమైన బాండ్‌ను సృష్టిస్తుంది. కథల ద్వారా ఆకర్షణ పొందడం సులభం కానీ ‘గిఫ్ట్స్’ అందించడం, పోటీలు పెట్టడం, సవాలు చేయడం వల్ల మరింత వేగంగా ప్రేక్షకుల అటెన్షన్ గ్రాబ్ చేయొచ్చు. అంతేకాదు చాలా మంది ఇన్‌స్టాగ్రామర్లు మార్కెట్ పోకడలను అర్థం చేసుకోవడానికి పోల్స్‌ను ఉపయోగిస్తారు. పోల్ నిర్వహించడం కూడా ఒక సాధారణ ఎంపిక! కానీ ఇది ప్రేక్షకుల ఎంగేజ్‌మెంట్ పెంచేందుకు సాయపడుతుంది. స్టిక్కర్‌లు ప్రదర్శిస్తూ వారితో గేమ్ ఆడొచ్చు. స్టోరీలపై ప్రశ్నలడగమని కోరవచ్చు. ఇలా ఏదో ఒక రకంగా ఫాలోవర్స్‌తో ఇంటారాక్ట్ కావడం వల్ల ప్రజలు బాగా గమనిస్తారు, గుర్తుపెట్టుకుంటారు.
బయో
బలమైన బయో కలిగి ఉండాలి. ఆ బయో మీ గురించి లేదా మీ బ్రాండ్ గురించి ఉత్తమంగా తెలియజేయాలి. కానీ అది నేరుగా ఉండకూడదని గ్రహించండి. ప్రజలు ప్రత్యేక సామాజిక-ఆర్థిక ఉద్యమాలతో తమను తాము గుర్తిస్తున్నారు. ‘ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి’ ‘ప్రకృతిని కాపాడుకుందాం’ ‘స్థానిక కళాకారులకు మద్దతునిద్దాం’ వంటి సామాజిక అంశాలు ప్రతిబింబించేల బయోను రూపొందించండి. మన బ్రాండ్ అవగాహన బయోపై ఆధారపడి ఉంటుందని గ్రహించండి. డిస్‌ప్లే పిక్చర్ కోసం కచ్చితమైన లోగోను కలిగి ఉండండి. ప్రత్యేక వెబ్‌సైట్ కలిగి ఉండటం, పేజీని బిజినెస్ అకౌంట్‌గా మార్చాలి. ఇక ఫీడ్‌ని గమనించండి, అక్కడ చాలా రంగులుంటే, అది ఎంగేజ్‌మెంట్‌కు అనుకూలించదు. ఎమోషనల్ కనెక్టింగ్ పాయింట్‌తో, కలర్స్ ద్వారా ప్రజలు బ్రాండ్‌లను గుర్తుంచుకుంటారు. ఇక పోస్టింగ్ విషయానికి వస్తే.. చాలా తక్కువగా పోస్ట్ చేయవద్దు (3 రోజులకు ఒకసారి) లేదా చాలా తరచుగా పోస్ట్ చేయవద్దు (ప్రతి 3 గంటలకు). రెండూ హానికరం.
ఎంగేజ్‌మెంట్
ఇన్‌ఫ్లుయెన్సర్ ఎంగేజ్‌మెంట్ అనేక విధాలుగా చేయవచ్చు. అందులో పెయిడ్ ప్రమోషన్ ఒకటి. మైక్రో సెలబ్రిటీ మన గురించి ప్రత్యేకంగా ఏదైనా పోస్ట్ చేయవచ్చు లేదా మనకు మద్ధతుగా మాట్లాడొచ్చు. ఏదేమైనా సెలబ్రిటీని ఎంగేజ్ చేయడానికి ప్రతి ఒక్కరికీ ఆర్థిక మద్దతు ఉండకపోవచ్చు. అందువల్ల సదరు ఇన్‌ఫ్లుయెన్సర్ లేదా మైక్రో సెలబ్రిటీతో కొలాబరేట్ కావాలి. కానీ అందుకోసం మనమిచ్చే కంటెంట్‌లో వర్త్ ఉండాలి. ఎంగేజ్‌మెంట్ పెంచడానికి మరొక అద్భుతమైన మార్గం ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో ప్రత్యక్ష ప్రసారం చేయడం. 80% మంది ప్రేక్షకులు బ్లాగ్ పోస్ట్‌ని చదవడం కంటే ప్రత్యక్ష ప్రసారాన్ని చూసేందుకే ప్రాధాన్యతనిస్తారు.
రీల్స్
షార్ట్ వీడియోలు చాలా ప్రభావాన్ని కలిగిస్తాయి. తక్కువ సమయంలోనే ఉత్తమ సందేశాన్ని కలిగి ఉంటాయి. ఫాలోవర్స్ పొందడానికి నిజంగా మనకు కావలసింది కూడా అదే.
సోషల్ మీడియాలో నిజాయితీగా ఉండటం మంచింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో బిహైండ్ సీన్స్ ఫుటేజీని షేర్ చేయడం, నవ్వు తెప్పించే క్యాప్షన్ రాయడం వంటి వాటికి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. వాస్తవానికి ఇమేజెస్ కంటే వీడియోలు 38% ఎక్కువ ఎంగేజ్‌మెంట్ పొందుతాయి. అయితే వీడియోల విషయంలో అతిగా ఆలోచించవద్దు. వీడియో కంటెంట్ మితిమీరిన పాలిష్ చేయకూడదు. ఒరిజినాలిటీనే ఆడియన్స్ ఇష్టపడతారు.
క్యాప్షన్స్
ఒక చిత్రం వెయ్యి పదాలతో సమానం. కానీ వెయ్యి పదాలు కూడా వెయ్యి పదాలతో విలువైనవే. ఇన్‌స్టాగ్రామ్ క్యాప్షన్స్‌లో 2,200 క్యారెక్టర్స్, 30 హ్యాష్‌ట్యాగ్‌ల వరకు ఉపయోగించుకోవచ్చు. ఉత్తమ క్యాప్షన్స్ వ్యూయర్‌ను ఈజీగా గ్రాబ్ చేయడంతో పాటు బ్రాండ్ వ్యాల్యూను ప్రదర్శిస్తాయి.
ఆడియన్స్ స్టోరీలను షేర్ చేయడం, సొంతంగా స్టిక్కర్స్, ఫిల్టర్స్ క్రియేట్ చేయడం కూడా మంచి ఫలితాలను అందిస్తాయి. ప్రయోగాలు చేయడానికి సిద్ధపడాలి. పాత రూల్స్ బ్రేక్ చేసి, కొత్తదనాన్ని అందించడం వల్ల రీచ్ ఎక్కువగా ఉంటుంది. కామెంట్స్‌కు ప్రాధాన్యతనివ్వాలి. సమకాలిన లేదా బజ్ ఉన్న కంటెంట్‌పై ప్రేక్షకులతో మాట్లాడాలి. ఫాలోవర్స్‌కు డైరెక్ట్ మెసేజ్ చేయడం వల్ల వారి అభిమానాన్ని మరింత పొందొచ్చు. రోజురోజుకు పనితీరును మెరుగుపరుచుకుంటూ వెళితే ఈజీగా ఫాలోవర్స్‌ను సంపాదించుకోవచ్చు.