రేపటి నుంచి ఎస్‌జీటీల పోరుబాట

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్‌జీటీ సమస్యలపై పోరాటంలో భాగంగా 14,15 తేదీల్లో భోజన విరామ నిరసనలు చేపడుతున్నట్టు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం (ఎస్‌జీటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.మహిపాల్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన సమయాల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన చేపడుతున్నట్టు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని అందులో డిమాండ్ చేశారు. విద్యారంగంలో ఖాళీగా ఉన్న 30 వేల పోస్టుల […]

Update: 2020-12-12 11:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్‌జీటీ సమస్యలపై పోరాటంలో భాగంగా 14,15 తేదీల్లో భోజన విరామ నిరసనలు చేపడుతున్నట్టు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం (ఎస్‌జీటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.మహిపాల్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన సమయాల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన చేపడుతున్నట్టు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని అందులో డిమాండ్ చేశారు. విద్యారంగంలో ఖాళీగా ఉన్న 30 వేల పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు ప్రారంభించాలని, విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. పోరబాటలో భాగంగా ఈ నెల 16వ తేదీన కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News