ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నిరసన
దిశ ప్రతినిధి, మెదక్: ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు తమకు అనుకూలంగా ఉన్న వారికి పలహారంలా పంచి పెడుతున్నారు. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని తెలిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కానీ.. సిద్దిపేట జిల్లా కేంద్రంలో అలా జరగడం లేదు. ఒకప్పుడు ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిని అడ్డుకున్న అధికారులే ఇప్పుడు వారి పేరిట పట్టాలు చేసి ఇస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సిద్దిపేట పట్టణ […]
దిశ ప్రతినిధి, మెదక్: ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు తమకు అనుకూలంగా ఉన్న వారికి పలహారంలా పంచి పెడుతున్నారు. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని తెలిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కానీ.. సిద్దిపేట జిల్లా కేంద్రంలో అలా జరగడం లేదు. ఒకప్పుడు ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిని అడ్డుకున్న అధికారులే ఇప్పుడు వారి పేరిట పట్టాలు చేసి ఇస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సిద్దిపేట పట్టణ కేంద్రం హైద్రాబాద్ రోడ్డులో పలు భూములు అన్యాక్రాంతమయ్యాయని, దీనిపై మంత్రి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రభుత్వ భూములు అన్యాకాంతం …..
సిద్దిపేట పట్టణ కేంద్రంలోని రాజీవ్ రహదారి హైద్రాబాద్ రోడ్డులో అత్యంత విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. సిద్దిపేట పట్టణంలో 1301, 1309, 1340 సర్వే నెంబర్ గల భూములకు చాలా విలువ ఎక్కువ. అలాంటి భూములను కాపాడాల్సిన అధికారులు తమకు అనుకూలంగా ఉన్న నాయకులకు పట్టా చేసి ఇచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ గజం జాగా కూడా లభ్యం కావడం లేదు. ఇదంతా మంత్రి ఇలాఖలో జరుగుతున్న ఇప్పటి వరకు మంత్రి స్పందించకపోవడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక సందర్భంలో మంత్రియే దగ్గరుండి తమకు అనుకూలంగా ఉన్న నాయకులకు ప్రభుత్వ భూమిని కట్టబెడుతున్నారా అంటూ సోషల్ మీడియాలో మంత్రిపై ఆరోపణలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నిరసన …
సిద్దిపేట పట్టణంలో అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అక్షయ హోటల్ వెనుక ఉన్న స్థలంలో ఫంక్షన్ హాల్ కట్టిస్తామని హమీ ఇచ్చారు. ఇప్పుడేమో ఆ ప్రభుత్వ భూమిని వేరే వారి మీద పట్టా మార్పిడి చేశారు. మాకు ఫంక్షన్ హల్ ఎక్కడ కట్టిస్తారంటూ కేసీఆర్ నగర్ కాలనీకి చెందిన పలువురు ప్రజలు శనివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు పంక్షన్ హల్ కట్టిస్తామన్న చోట నెల్లుట్ల రమణకు 500 గజాల భూమి, వంగ గాలిరెడ్డికి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు ఇది వరకే కోట్ల విలువ చేసే భూమి ఇచ్చారు. ఇప్పుడు వారి వారసుడు వంగ దుర్గారెడ్డికి రెండు వేల గజాల స్థలం ఇచ్చారు. ఇలా కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఫలహారంలా పంచి పెట్టడమెందని, భూమి లేని నిరుపేదలను పంచిన బాగుంటుండే అంటూ పలువురు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం కాకుండా చూడాలని, పట్టా మార్పిడి చేసిన వారి నుండి తిరిగి ఆ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.