స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నిరసన
దిశ, సిద్దిపేట: 73 ఏళ్ల స్వాతంత్ర్య పాలనలో దళితులకు రక్షణ కరువైందని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అన్నారు. వెలూర్ లో దళిత రైతు బ్యాగరి నర్సిములు ఆత్మహత్యకు బాధ్యులైన సర్పంచ్, తహసీల్దారు, వీఆర్వోలను అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబాన్ని పూర్తి స్ధాయిలో అదుకొవాలని డిమాండ్ చేస్తూ స్వాతంత్ర్య వేడుకలలో నిరసన వ్యక్తం చేయాలని దళిత సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ పిలుపు మేరకు శనివారం లింగుపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన […]
దిశ, సిద్దిపేట: 73 ఏళ్ల స్వాతంత్ర్య పాలనలో దళితులకు రక్షణ కరువైందని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అన్నారు. వెలూర్ లో దళిత రైతు బ్యాగరి నర్సిములు ఆత్మహత్యకు బాధ్యులైన సర్పంచ్, తహసీల్దారు, వీఆర్వోలను అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబాన్ని పూర్తి స్ధాయిలో అదుకొవాలని డిమాండ్ చేస్తూ స్వాతంత్ర్య వేడుకలలో నిరసన వ్యక్తం చేయాలని దళిత సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ పిలుపు మేరకు శనివారం లింగుపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అంటరానితనం నిర్మూలన పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. భూ పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం, వివక్షత పాటిస్తుందన్నారు. ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాల్ నర్సు, వార్డు సభ్యులు భూషణం, నాయకులు కె.రాజు, భాస్కర్, బాల కిష్టయ్య, కర్రె శ్రీ నివాస్, రవి, నతనేల్, ముత్యాలు, బాల్ నర్సు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.