తిరుమల పవిత్రతను కాపాడండి..!

దిశ ప్రతినిధి, హైదరాబాద్: తిరుమలలో అన్యమతస్తుల డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ దేవస్థానం చైర్మన్ ప్రకటించడం దారుణమని తెలంగాణ విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కార్యదర్శి బండారి రమేశ్ అన్నారు. అన్యమతస్తుల నుంచి తిరుమల పవిత్రతను కాపాడడానికి తీసుకొచ్చిన ఈ సంప్రదాయాన్ని కాలరాస్తూ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. సేవా ధృక్పథంతో దాతల సహకారంతో నిర్మించిన గదులను వ్యాపారపరంగా ఆలోచిస్తూ గదుల అద్దెలను రెట్టింపు చేయడం, ప్రసాదాల ధరలను పెంచడం సరైనది కాదని […]

Update: 2020-09-20 09:10 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: తిరుమలలో అన్యమతస్తుల డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ దేవస్థానం చైర్మన్ ప్రకటించడం దారుణమని తెలంగాణ విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కార్యదర్శి బండారి రమేశ్ అన్నారు. అన్యమతస్తుల నుంచి తిరుమల పవిత్రతను కాపాడడానికి తీసుకొచ్చిన ఈ సంప్రదాయాన్ని కాలరాస్తూ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

సేవా ధృక్పథంతో దాతల సహకారంతో నిర్మించిన గదులను వ్యాపారపరంగా ఆలోచిస్తూ గదుల అద్దెలను రెట్టింపు చేయడం, ప్రసాదాల ధరలను పెంచడం సరైనది కాదని బండారి రమేష్ విమర్శించారు. తిరుమలను వ్యాపార కోణంలో తీసుకెళ్తూ భక్తుల మనోభావాలను కించపరుస్తున్నారని ఆరోపించారు. పవిత్ర తిరుమలలో అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలని.. ప్రస్తుతం ఉన్న అన్యమతస్థుల డిక్లరేషన్ విధానాన్ని యధావిధిగా కొనసాగించాలని బండారి రమేశ్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News