ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 8 షెడ్యూల్ విడుదల

దిశ, స్పోర్ట్స్ : ఇండియాలో ఐపీఎల్ తర్వాత ఎక్కువ మంది వీక్షించే ప్రో కబడ్డీ లీగ్ మళ్లీ వచ్చేసింది. 2020లో కరోనా మహమ్మారి కారణంగా సీజన్‌ను రద్దు చేశారు. తాజాగా ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 8ని డిసెంబర్ 8 నుంచి నిర్వహించనున్నట్లు మార్షల్ స్పోర్ట్స్ తెలిపింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసింది. ప్రో కబడ్డీ లీగ్‌లో 12 జట్లు డబుల్ రౌండ్ రాబిన్ పద్దతిలో లీగ్ మ్యాచ్‌లలో తలపడతాయి. ఈ సారి సీజన్ […]

Update: 2021-12-01 11:00 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇండియాలో ఐపీఎల్ తర్వాత ఎక్కువ మంది వీక్షించే ప్రో కబడ్డీ లీగ్ మళ్లీ వచ్చేసింది. 2020లో కరోనా మహమ్మారి కారణంగా సీజన్‌ను రద్దు చేశారు. తాజాగా ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 8ని డిసెంబర్ 8 నుంచి నిర్వహించనున్నట్లు మార్షల్ స్పోర్ట్స్ తెలిపింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసింది. ప్రో కబడ్డీ లీగ్‌లో 12 జట్లు డబుల్ రౌండ్ రాబిన్ పద్దతిలో లీగ్ మ్యాచ్‌లలో తలపడతాయి. ఈ సారి సీజన్ మొత్తం షెరటాన్ గ్రాండ్ బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌లోనే నిర్వహించనున్నారు. వైట్ ఫీల్డ్ హోటల్ మొత్తాన్ని బయోబబుల్ సెక్యూర్ చేశారు. 12 జట్లకు సంబంధించిన ఆటగాళ్లు, ఇతర సిబ్బంది అంతా లీగ్ ముగిసే వరకు అదే హోటల్‌లో బస చేయనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. బయోబబుల్ నిబంధనలు అనుసరించి క్రమం తప్పకుండా అందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇక డిసెంబర్ 22న తొలి మ్యాచ్ బెంగళూరు బుల్స్ – యూ ముంబా మధ్య జరుగనున్నది. అదే రోజు మరో రెండు మ్యాచ్‌లు కూడా ఉంటాయి. రెండేళ్ల తర్వాత లీగ్ నిర్వహిస్తున్నందున తొలి నాలుగు రోజులు ట్రిపుల్ హెడర్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఆ తర్వాత వీకెండ్స్‌లో మాత్రమే ట్రిపుల్ హెడర్ మ్యాచ్‌లు ఉంటాయి. ప్రతీ రోజు రెండు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. జనవరి 20 తర్వాత జరుగనున్న మ్యాచ్‌లు షెడ్యూల్ తర్వాత ప్రకటించనున్నారు.

https://twitter.com/ProKabaddi/status/1466065692675821574?s=20

Tags:    

Similar News