భవిష్యత్ తరం నిన్ను క్షమించదు : ప్రియాంక వాద్రా

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. యూపీలోనూ కరోనా వైరస్ తన పంజా విసురుతోంది. అయితే, ప్రభుత్వం కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక వాద్రా తీవ్రంగా విరుచుకుపడ్డారు. మంగళవారం ముఖ్యమంత్రికి లేఖ రాసిన ఆమె.. ‘భవిష్యత్ తరం నిన్ను క్షమించదని సీఎం యోగి ఆదిత్యనాధ్ పై కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కొవిడ్ -19 పరీక్షలు తక్కువగా చేయడం, ఆక్సిజన్ పడకల కొరత, మందకోడిగా టీకాలు వేస్తున్నట్లు లేఖలో […]

Update: 2021-04-27 10:47 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. యూపీలోనూ కరోనా వైరస్ తన పంజా విసురుతోంది. అయితే, ప్రభుత్వం కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక వాద్రా తీవ్రంగా విరుచుకుపడ్డారు.

మంగళవారం ముఖ్యమంత్రికి లేఖ రాసిన ఆమె.. ‘భవిష్యత్ తరం నిన్ను క్షమించదని సీఎం యోగి ఆదిత్యనాధ్ పై కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కొవిడ్ -19 పరీక్షలు తక్కువగా చేయడం, ఆక్సిజన్ పడకల కొరత, మందకోడిగా టీకాలు వేస్తున్నట్లు లేఖలో ఆరోపించారు. ‘‘సంక్షోభం ఉన్న ఈ సమయంలో మీరు ప్రభుత్వ వనరులను సంకల్పంతో ఉపయోగించుకోకపోతే, భవిష్యత్ తరాలు ఎప్పటికీ మిమ్మల్ని క్షమించవు’’ అని మండిపడ్డారు.

Tags:    

Similar News