ఆమెకు జాబ్ రాకపోవడానికి.. ఇంటిపేరే అడ్డు!
దిశ, వెబ్‌డెస్క్ : ఉద్యోగం రావాలంటే.. క్వాలిఫికేషన్‌తో పాటు ప్రతిభ ఉండాలనేది తెలుసు. కానీ ఇంటిపేరు కూడా పద్దతిగా ఉండాలా? వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా.. అలాంటి సంఘటనే ఒకటి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఓ యువతి ఇంటి పేరు కారణాంగానే ఆమె అప్లికేషన్ రిజెక్ట్ అవుతోంది. ఇప్పటికే తాను ఎన్నోసార్లు ఉద్యోగం కోసం అప్లయ్ చేయడానికి ప్రయత్నించినా.. ప్రతీసారి ఆమెకు చేదు అనుభవమే మిగిలింది? ఇంతకీ ఆమె ఇంటి పేరు ఏంటి? ఎందుకు రిజెక్ట్ అవుతోంది? అసోంలోని […]
దిశ, వెబ్‌డెస్క్ :
ఉద్యోగం రావాలంటే.. క్వాలిఫికేషన్‌తో పాటు ప్రతిభ ఉండాలనేది తెలుసు. కానీ ఇంటిపేరు కూడా పద్దతిగా ఉండాలా? వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా.. అలాంటి సంఘటనే ఒకటి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఓ యువతి ఇంటి పేరు కారణాంగానే ఆమె అప్లికేషన్ రిజెక్ట్ అవుతోంది. ఇప్పటికే తాను ఎన్నోసార్లు ఉద్యోగం కోసం అప్లయ్ చేయడానికి ప్రయత్నించినా.. ప్రతీసారి ఆమెకు చేదు అనుభవమే మిగిలింది? ఇంతకీ ఆమె ఇంటి పేరు ఏంటి? ఎందుకు రిజెక్ట్ అవుతోంది?
అసోంలోని గోగాముఖ్ నగరానికి చెందిన ప్రియాంకకు తన ఇంటిపేరే తంటాలు తెచ్చిపెడుతోంది. ప్రియాంక.. అగ్రికల్చరల్ ఎకానమిక్స్, ఫార్మ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేసింది. ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌సీఎల్)లో ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తును ఫిల్ చేసేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె అప్లయ్ చేసిన ప్రతీసారి సర్ నేమ్ కారణంగా రిజెక్ట్ అవుతోంది. ఎన్నిసార్లు అప్లయ్ చేసినా.. మళ్లీ మళ్లీ అదే ఫలితం. పైగా ఆ సర్‌నేమ్ ఉపయోగించవద్దని వెబ్‌సైట్ నుంచి సూచన. దీంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురైంది. ఆ ఇంటిపేరే ‘చూతియా’! దీన్ని ఇంగ్లీష్‌లో ‘సుతియా’గా ప్రొనౌన్స్ చేయాలి. అస్సామీలోని ‘చూతియా’ కమ్యూనిటీకి చెందిన అమ్మాయే ప్రియాంక. ఇది చాలా పురాతనమైన కమ్యూనిటీ. ఇదో గిరిజన సమాజం. మంగోలియా మూలాలు కలిగిన చైనా-టిబెటిన్ కుటుంబానికి చెందినదిగా పరిగణిస్తుంటారు. అయితే, హిందీలో మాత్రం.. చుతియా అంటే చాలా పెద్ద బూతు. అదే ఇక్కడ ప్రియాంకకు చిక్కులు తీసుకొచ్చింది. ఇక ఆమె ఓపిక నశించి.. ఫేస్‌బుక్‌లో బాధతో ఓ పోస్ట్ పెట్టింది.
‘నా ఇంటి పేరుతో దరఖాస్తు చేస్తుంటే సరైన పదాలను ఉపయోగించమని ఎర్రర్ మెసేజ్ వస్తోంది. ఇది తప్పుడు పదం కాదు, దయచేసి అర్థం చేసుకోండి.. ఇది మా కమ్యూనిటీకి చెందిన పదం. ఇది నాకు చాలా పెద్ద సమస్యగా తయారైంది. అయితే దీనిపై సోషల్ మీడియాలో అనవసరమైన చర్చ చేయొద్దు, ఇటువంటి సమస్యకు పరిష్కారం చూపాలి’ అని ఆమె కోరారు. ఆ తరువాత ఎన్‌ఎస్‌సీఎల్ కంపెనీ వెబ్‌సైట్ కోడ్‌ను సరిచేశారు. హిందీ, ఉర్దూ భాషల్లో చూతియా అనేది బూతు పదం కావటంతో సదరు ఆన్‌లైన్ పోర్టల్‌లో ఆ పదాన్ని రిజక్టెడ్ లిస్ట్‌లో పెట్టారు. ఈ క్రమంలో అభ్యర్థుల పేరు ఫిల్డర్‌కు వాడే కోడ్‌ను సరి చేసి ఈ సమస్యను పరిష్కరిస్తామని ఎన్‌ఎస్‌సీఎల్‌లోని టెక్నికల్ హెల్ప్ డెస్క్ తెలిపింది. చివరికి ప్రియాంక దరఖాస్తును సదరు సంస్థ స్వీకరించింది. చూతియా పేరుతో ఉన్న వేలాది మంది ఖాతాలను ఫేస్‌బుక్ తొలగించిందని గతంలో ‘ఆల్ అసోం చూతియా స్టూడెంట్స్ యూనియన్(ఏఏసీఎస్‌యూ)’ కూడా ఆరోపించిన విషయం తెలిసిందే.