సోను.. నా ఫుల్ సపోర్ట్ నీకే : ప్రియాంక

దిశ, సినిమా : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. నటుడు సోను సూద్‌ను ‘విజనరీ ఫిలాంత్రఫిస్ట్‌’గా అభివర్ణించింది. కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన ఏ బిడ్డకైనా ఉచిత విద్యను అందించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన వీడియోను షేర్ చేస్తూ ఆయనపై ప్రశంసలు కురిపించింది. తన కో-స్టార్ సోను సూద్.. దూరదృష్టి కలిగిన పరోపకారి అని కొనియాడింది. తన ఆలోచన ప్రభావం దీర్ఘకాలికమైనదని వివరించింది. కరోనా కారణంగా తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరిని కోల్పోయిన పిల్లల […]

Update: 2021-05-03 08:14 GMT

దిశ, సినిమా : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. నటుడు సోను సూద్‌ను ‘విజనరీ ఫిలాంత్రఫిస్ట్‌’గా అభివర్ణించింది. కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన ఏ బిడ్డకైనా ఉచిత విద్యను అందించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన వీడియోను షేర్ చేస్తూ ఆయనపై ప్రశంసలు కురిపించింది. తన కో-స్టార్ సోను సూద్.. దూరదృష్టి కలిగిన పరోపకారి అని కొనియాడింది. తన ఆలోచన ప్రభావం దీర్ఘకాలికమైనదని వివరించింది.

కరోనా కారణంగా తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరిని కోల్పోయిన పిల్లల చదువుకు అంతరాయం కలగరాదని.. కన్నవారిని కోల్పోతే ఏర్పడిన ఆర్థిక కారణాలు వారి చదువుకు అడ్డుకాకూడదన్నదే సోను ఆలోచన కాగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పిల్లలకు ఉచిత విద్యను అందించాలని తన పోస్టులో విజ్ఞప్తి చేశాడు సోను. వారు ఏ దశలో చదువుతున్నారు(పాఠశాల, కళాశాల, ఉన్నత చదువులు) అనే దానితో సంబంధం లేకుండా ఆర్థికంగా భరోసా ఇవ్వాలని అందులో పేర్కొన్నాడు. ఒకవేళ ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు లేని పిల్లలు పెద్ద సంఖ్యలో ఉండే అవకాశం ఉందని హెచ్చరించాడు.

కాగా, సోను ఐడియాస్‌కు ఫుల్‌ సపోర్ట్ ఇస్తున్నానన్న ప్రియాంక.. దీనికి పరిష్కారం కనుగొనే దిశగా ప్రయత్నిస్తానని ప్రామిస్ చేసింది. ఎడ్యుకేషన్ అనేది ప్రతీ చిన్నారి హక్కుగా భావిస్తున్నానని తెలిపిన ఆమె.. వారిని చదివించేందుకు ముందుకు రావాలని కోరింది.

 

Tags:    

Similar News