రెస్టారెంట్‌ను సందర్శించిన ప్రియాంక.. ఏం టేస్ట్ చేసిందంటే?
దిశ, సినిమా : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా న్యూయార్క్‌లో ఇండియన్ వంటకాలతో ‘సోనా’ రెస్టారెంట్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. అయితే లాంచింగ్ సమయంలో షూటింగ్‌తో బిజీగా ఉన్న ప్రియాంక.. తాజాగా తన డ్రీమ్ రెస్టారెంట్‌ను సందర్శించింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపిన ఆమె.. సోనా విజిట్ యూనిక్ ఎక్స్పీరియన్స్ అని వివరించింది. తన పేరున్న ప్రైవేట్ భోజనాల గది నుంచి అందమైన ఇంటీరియర్స్, భారతీయ కళాకారుల అద్భుతమైక కళ, రుచికరమైన ఆహారానికి ఫిదా […]
దిశ, సినిమా : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా న్యూయార్క్‌లో ఇండియన్ వంటకాలతో ‘సోనా’ రెస్టారెంట్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. అయితే లాంచింగ్ సమయంలో షూటింగ్‌తో బిజీగా ఉన్న ప్రియాంక.. తాజాగా తన డ్రీమ్ రెస్టారెంట్‌ను సందర్శించింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపిన ఆమె.. సోనా విజిట్ యూనిక్ ఎక్స్పీరియన్స్ అని వివరించింది. తన పేరున్న ప్రైవేట్ భోజనాల గది నుంచి అందమైన ఇంటీరియర్స్, భారతీయ కళాకారుల అద్భుతమైక కళ, రుచికరమైన ఆహారానికి ఫిదా అయిపోయినట్లు తెలిపింది.
రెస్టారెంట్ ఎక్స్పెక్టేషన్స్కు మించి ఉండటంతో ఇండియాలో ఇంట్లో ఉన్నట్లుగా అనిపించిందని వివరించింది. తను టేస్ట్ చేసిన దోస, ప్రాన్స్, పకోరాస్, గప్చుప్కు సంబంధించిన మెను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. మూడేళ్ల ప్లానింగ్ తర్వాత ఫైనల్‌గా తన డ్రీమ్ రెస్టారెంట్లో ఉండటం నమ్మలేకపోతున్నాని చెప్పింది. న్యూయార్క్‌లో ఇండియన్ ఫుడ్ డైనింగ్ డెస్టినేషన్ గురించి తాము నిన్ననే చర్చించినట్లు అనిపిస్తుందని, అప్పుడే నిజమై తన కళ్ల ముందే ఉందని, సోనా సక్సెస్‌కు కారణమైన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది.