నిజాం హాస్పిటల్, క్లినిక్ సీజ్.. ఎందుకో తెలుసా.?

దిశ ప్రతినిధి, మేడ్చల్ : నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రెండు ప్రైవేట్ ఆసుపత్రులను వైద్యారోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు. మేడ్చల్ జిల్లాలోని నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న ‘రేష్మా క్లినిక్’తో పాటు ‘నిజాం హాస్పిటల్’లను డిఎంహెచ్ఓ డాక్టర్ మల్లీకార్జున రావు మూసివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రెండు ఆసుపత్రులు నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్నట్లు తెలిపారు. సకాలంలో రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం, అర్హులైన వైద్యులు లేకుండా అర్హత లేని వారిచే చికిత్సలు చేయించడం, ప్రజలకు తెలిసి, తెలియని […]

Update: 2021-04-01 09:52 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్ : నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రెండు ప్రైవేట్ ఆసుపత్రులను వైద్యారోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు. మేడ్చల్ జిల్లాలోని నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న ‘రేష్మా క్లినిక్’తో పాటు ‘నిజాం హాస్పిటల్’లను డిఎంహెచ్ఓ డాక్టర్ మల్లీకార్జున రావు మూసివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రెండు ఆసుపత్రులు నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్నట్లు తెలిపారు.

సకాలంలో రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం, అర్హులైన వైద్యులు లేకుండా అర్హత లేని వారిచే చికిత్సలు చేయించడం, ప్రజలకు తెలిసి, తెలియని మందులను సిఫారసు చేస్తూ.. ఏలాంటి ప్రమాణాలు పాటించకుండా ఆసుపత్రులను నిర్వహిస్తుండడంతో కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలోని అన్ని ‘అల్లో పతిక్ వైద్య సేవలందిస్తున్న సంస్థలు కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, అర్హులైన వైద్యులే చికిత్సలు నిర్వహించాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని, లేనిచో అలాంటి ఆసుపత్రులపై కఠినచర్యలు తీసుకోని సీజ్ చేస్తామని హెచ్చరించారు.

మరికొన్ని ఆసుపత్రులు, క్లినిక్ లు, డెంటల్ ఆసుపత్రులు, పిజియోథెరఫి క్లినిక్ లు, డయాగ్నిస్టిక్ సెంటర్లు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని, వీటిని కూడా వారం రోజుల్లో మూసి వేయనున్నట్లు ఆయన తెలిపారు. అలాంటి వారు తక్షణమే అనుమతులు పొందాలని కోరారు. ఆసుపత్రులను సీజ్ చేసే కార్యక్రమంలో డీఎంఅండ్ హెచ్ ఓ డాక్టర్ మల్లీకార్జున రావుతోపాటు జిల్లా మాస్ మీడియా అధికారి వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 

Tags:    

Similar News