కరోనా కట్టడికి ప్రయివేటు ఆసుపత్రులు సహకరించాలి
దిశ, వరంగల్: కరోనా వైరస్ కట్టడికి జిల్లాలోని ప్రయివేటు ఆసుపత్రులు సహకరించాలని ప్రభుత్వ నిబంధనలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఓ ప్రకటనలో తెలిపారు. కోవిడ్-19 దృష్ట్యా అత్యవసరమైతే తప్పా ఏ ఆపరేషన్లు చేయరాదని కోరారు. శ్వాస కోశ సమస్యలు ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఓపీ ఏర్పాటు చేయాలని సూచించారు. కొవిడ్-19 నిర్ధారణ కోసం కేంద్రాలను అన్ని ఆసుపత్రుల్లోనూ ఏర్పాటు చేయాలన్నారు. నిర్ధారణ కేంద్రాల్లో విదేశాల నుంచి వచ్చిన వారి […]
దిశ, వరంగల్: కరోనా వైరస్ కట్టడికి జిల్లాలోని ప్రయివేటు ఆసుపత్రులు సహకరించాలని ప్రభుత్వ నిబంధనలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఓ ప్రకటనలో తెలిపారు. కోవిడ్-19 దృష్ట్యా అత్యవసరమైతే తప్పా ఏ ఆపరేషన్లు చేయరాదని కోరారు. శ్వాస కోశ సమస్యలు ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఓపీ ఏర్పాటు చేయాలని సూచించారు. కొవిడ్-19 నిర్ధారణ కోసం కేంద్రాలను అన్ని ఆసుపత్రుల్లోనూ ఏర్పాటు చేయాలన్నారు. నిర్ధారణ కేంద్రాల్లో విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ప్రతి ప్రైవేటు ఆసుపత్రిలోనూ
ప్రత్యేకమైన ఐసోలేషన్ వార్డులు, గదులు ఏర్పాటు చేయాలన్నారు.
Tags: Private hospitals, cooperate, corona virus, warangal, collector