మోహన్‌లాల్ డైరెక్షన్‌లో పృథ్వీరాజ్.. షూట్ గోయింగ్ ఆన్?
దిశ, సినిమా: మల్టీటాలెంటెడ్ మాలీవుడ్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్‌లో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘లూసిఫర్’. బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన ఈ మూవీకి పృథ్వీరాజ్ సీక్వెల్ కూడా ప్రకటించగా.. ‘ఎంపురన్(రాజుకు మించి దేవుడికి తక్కువ)’ అనే టైటిల్ ఫైనల్ చేసినట్లు వార్తలొచ్చాయి. ఈ సంగతి పక్కనబెడితే ప్రస్తుతం మోహన్ లాల్ తొలిసారి డైరెక్ట్ చేస్తున్న ‘బరోజ్(Barroz)’ మూవీలో పృథ్వీరాజ్ కీ రోల్ ప్లే చేస్తున్నట్టు సమాచారం. 4 దశాబ్దాల నుంచి మాలీవుడ్ ఇండస్ట్రీలో […]
దిశ, సినిమా: మల్టీటాలెంటెడ్ మాలీవుడ్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్‌లో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘లూసిఫర్’. బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన ఈ మూవీకి పృథ్వీరాజ్ సీక్వెల్ కూడా ప్రకటించగా.. ‘ఎంపురన్(రాజుకు మించి దేవుడికి తక్కువ)’ అనే టైటిల్ ఫైనల్ చేసినట్లు వార్తలొచ్చాయి. ఈ సంగతి పక్కనబెడితే ప్రస్తుతం మోహన్ లాల్ తొలిసారి డైరెక్ట్ చేస్తున్న ‘బరోజ్(Barroz)’ మూవీలో పృథ్వీరాజ్ కీ రోల్ ప్లే చేస్తున్నట్టు సమాచారం.
4 దశాబ్దాల నుంచి మాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా కొనసాగుతున్న మోహన్ లాల్(లాలెటా).. ‘బరోజ్-గార్డియన్ ఆఫ్ డిగామాస్ ట్రెజర్’ అనే 3డీ ఫాంటసీ చిల్డ్రన్ ఫిల్మ్ ద్వారా డైరెక్టర్‌గా మారబోతున్నాడు. జిజో పున్నూస్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న సినిమాకు సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. ఈ సినిమా కోసం పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామాకు రక్షకుడిగా ఉండే బరోజ్ అనే ఫిక్షన్ క్యారెక్టర్‌లో మోహన్‌లాల్ కనిపించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని 2022లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తుండగా, తనకు పంపిన ‘బరోజ్’ స్క్రిప్ట్ కాన్ఫిడెన్షియల్ కాపీ పిక్‌ను హీరో పృథ్వీరాజ్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేశాడు. దీంతో లాలెటా దర్శకత్వంలో తను నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయిపోయింది.