అయ్యప్ప మాలలో స్కూల్ విద్యార్థి.. లోపలికి రావద్దన్న ప్రిన్సిపాల్
దిశ ప్రతినిధి, మెదక్ : అయ్యప్పమాలతో స్కూల్‌కు హాజరైన విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. అయ్యప్పమాల ధరించిన విద్యార్థికి స్కూల్‌కు వెళ్లగా అతనికి అనుమతి లేదంటూ పాఠశాల ప్రిన్సిపాల్ బయటే నిల్చోబెట్టిన దారుణ ఘటన సోమవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట గ్రామంలోని సేయింట్ మెరీస్ స్కూల్‌లో కిషోర్ అనే విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. అయితే, సోమవారం కిషోర్ అయ్యప్పమాల ధరించి స్కూల్‌కి రావడంతో […]
దిశ ప్రతినిధి, మెదక్ : అయ్యప్పమాలతో స్కూల్‌కు హాజరైన విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. అయ్యప్పమాల ధరించిన విద్యార్థికి స్కూల్‌కు వెళ్లగా అతనికి అనుమతి లేదంటూ పాఠశాల ప్రిన్సిపాల్ బయటే నిల్చోబెట్టిన దారుణ ఘటన సోమవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట గ్రామంలోని సేయింట్ మెరీస్ స్కూల్‌లో కిషోర్ అనే విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. అయితే, సోమవారం కిషోర్ అయ్యప్పమాల ధరించి స్కూల్‌కి రావడంతో పాఠశాల ప్రిన్సిపల్ డోమైన్ విద్యార్థిని స్కూల్‌లోకి అనుమతించలేదు. విషయం తెలుసుకున్న తోటి అయ్యప్ప భక్తులు స్కూల్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో చేసేదేమీ లేక ప్రిన్సిపల్ విద్యార్థిని లోనికి అనుమతిచ్చారు. కాగా, స్కూల్‌కి బొట్టు, గాజులు కూడా లేకుండా రావాలని విద్యార్థినీలు రావాలని ఆదేశించడంతో పిల్లల పేరెంట్స్ ప్రిన్సిపల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.