భారీ ధరకు అమ్ముడుపోయిన బ్రిటన్ ప్రిన్సెస్ డయానా కారు!
దిశ, ఫీచర్స్: అందమైన యువరాణిగా, బ్రిటన్ రాజ కుటుంబ వారసుడు ప్రిన్స్ చార్ల్స్ భార్యగా ప్రిన్సెస్ డయానా గురించి ప్రపంచానికి కొత్తగా చెప్పదేం లేదు. ఇరవయ్యవ శతాబ్దపు అందగత్తెల్లో ఒకరిగా గుర్తింపు పొందిన డయానా మరణించి రెండు దశాబ్దాలు దాటినా ఆమె జీవితానికి సంబంధించిన విశేషాలతో నేటికీ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇటీవలే ఆమె ప్రత్యేక పెళ్లి గౌనును లండన్‌లోని కెన్సింగ్టన్ ప్యాలెస్‌లో ప్రదర్శించడంతో ఆ బ్యూటిఫుల్ ప్రిన్సెస్‌ను మరోసారి ప్రపంచం గుర్తుకు తెచ్చుకుంది. ఇక తాజాగా […]
దిశ, ఫీచర్స్: అందమైన యువరాణిగా, బ్రిటన్ రాజ కుటుంబ వారసుడు ప్రిన్స్ చార్ల్స్ భార్యగా ప్రిన్సెస్ డయానా గురించి ప్రపంచానికి కొత్తగా చెప్పదేం లేదు. ఇరవయ్యవ శతాబ్దపు అందగత్తెల్లో ఒకరిగా గుర్తింపు పొందిన డయానా మరణించి రెండు దశాబ్దాలు దాటినా ఆమె జీవితానికి సంబంధించిన విశేషాలతో నేటికీ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇటీవలే ఆమె ప్రత్యేక పెళ్లి గౌనును లండన్‌లోని కెన్సింగ్టన్ ప్యాలెస్‌లో ప్రదర్శించడంతో ఆ బ్యూటిఫుల్ ప్రిన్సెస్‌ను మరోసారి ప్రపంచం గుర్తుకు తెచ్చుకుంది. ఇక తాజాగా డయానాకు చెందిన ఫోర్డ్ ఎస్కార్ట్ కారును వేలం వేశారు. దక్షిణ అమెరికాకు చెందిన మ్యూజియం నిర్వాహకులు ఆ కారును కొనుగోలు చేశారు. 40 ఏళ్లుగా రాయల్ గ్యారేజ్‌లోనే ఉన్న ఈ పాత కారు రికార్డు ధరకు అమ్ముడుపోవడం విశేషం.
బ్రిటన్‌లోని స్పెన్సర్ కుటుంబంలో 1961లో డయానా జన్మించింది. వీరి కుటుంబానికి, బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే 1977లో తొలిసారి ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ చిన్న కుమారుడు ప్రిన్స్ చార్లెస్, డయానాను చూశాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారగా 1981లో ప్రిన్స్ చార్లెస్ తన ప్రేమను డయానాకు తెలియజేయడంతో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో అదే సంవత్సరం వారి నిశ్చితార్ధం జరిగింది. ఈ సందర్భంగానే ఎంగేజ్‌మెంట్ గిఫ్ట్‌గా ప్రిన్స్ చార్లెస్ ఆమెకు ఫోర్డ్ ఎస్కార్ట్ కారును బహుమతిగా ఇచ్చాడు. 1981 జూలై 29 న వాళ్లిద్దరు ఒక్కటయ్యారు. ఇక చార్లెస్ ఇచ్చిన కారును ఆమె1982 ఆగస్టు వరకు ఉపయోగించిందని సమాచారం. ఇక ప్రస్తుతం దాన్ని వేలం వేయగా 50 వేల పౌండ్స్( రూ.50 లక్షల కన్నా ఎక్కువ)కు పైగా ధర పలికింది. ప్రస్తుతం డయానా వాడిన కారుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో ట్రెండింగ్‌లో నిలిచాయి.
1982లో ఒక పురాతన వస్తువుల వ్యాపారి 6వేలకు వేలంలో కొనుగోలు చేసిన ఈ వాహనాన్ని కొనుగోలు చేశాడు. కాగా ఈ కారు ఇప్పటికీ కారు అసలు రిజిస్ట్రేషన్ నెంబర్ WEV 297W ప్లేట్ ఇప్పటికి అలాగే ఉందట. కారులోని మీటర్ ప్రకారం ఈ కారు 83,000 మైళ్ళు(1,33,575 కిలోమీటర్లు) ప్రయాణించింది.
ఇక 1997 ఆగస్టులో పారిస్‌లో జరిగిన కారు ప్రమాదంలో డయానా 36 సంవత్సరాల వయసులో మరణించిన విషయం తెలిసిందే. ఇక డయానా 60వ(1961, జూలై 1)పుట్టినరోజు సందర్భంగా ఆమె కుమారులు, యువరాజులు విలియం, హ్యారీలు లండన్‌లోని కెన్సింగ్టన్ ప్యాలెస్ ఇంటిలో తన కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించారు.