ఆ దేశాధినేతలతో మోడీ సంభాషణ
న్యూఢిల్లీ: కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులపై శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, మారిషస్ పీఎం ప్రవింద్ జుగ్‌నాథ్‌లతో భారత ప్రధాని నరేంద్ర మోడీ చర్చించారు. రాజపక్స నేతృత్వంలో శ్రీలంక ప్రభావశీలంగా కొవిడ్ 19పై పోరాడుతున్నదని తెలిపారు. కరోనాను విజయవంతంగా కంట్రోల్ చేసిన మారిషస్‌కు మోడీ అభినందనలు తెలిపారు. కరోనా మహమ్మారితో నష్టపోతున్న తీరప్రాంత పొరుగుదేశాలకు భారత్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీనిచ్చారు. శ్రీలంకలో భారత సహకారంతో మొదలైన ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రధాని మోడీ, రాజపక్స […]
న్యూఢిల్లీ: కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులపై శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, మారిషస్ పీఎం ప్రవింద్ జుగ్‌నాథ్‌లతో భారత ప్రధాని నరేంద్ర మోడీ చర్చించారు. రాజపక్స నేతృత్వంలో శ్రీలంక ప్రభావశీలంగా కొవిడ్ 19పై పోరాడుతున్నదని తెలిపారు. కరోనాను విజయవంతంగా కంట్రోల్ చేసిన మారిషస్‌కు మోడీ అభినందనలు తెలిపారు. కరోనా మహమ్మారితో నష్టపోతున్న తీరప్రాంత పొరుగుదేశాలకు భారత్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీనిచ్చారు. శ్రీలంకలో భారత సహకారంతో మొదలైన ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రధాని మోడీ, రాజపక్స పరస్పరం అంగీకరించారు. అంతేకాదు, భారత ప్రైవేటు సెక్టార్ శ్రీలంకలో పెట్టుబడులు పెట్టే అవకాశాలపైనా చర్చించినట్టు మోడీ తెలిపారు.