భారతీయులందరికీ గర్వకారణం : ప్రధాని
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సిన్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు వ్యాక్సిన్లకు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి మంజూరు చేయడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన, కోవిడ్ రహిత భారత దేశానికి మార్గం సుగమమైందని తెలిపారు. వ్యాక్సిన్ కోసం కఠోరంగా శ్రమించిన శాస్త్రవేత్తలను, ఇన్నోవేటర్స్‌ను ఈ సందర్భంగా ప్రధాని అభినందించారు. సీరమ్ ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్లకు డీసీజీఐ […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సిన్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు వ్యాక్సిన్లకు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి మంజూరు చేయడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన, కోవిడ్ రహిత భారత దేశానికి మార్గం సుగమమైందని తెలిపారు. వ్యాక్సిన్ కోసం కఠోరంగా శ్రమించిన శాస్త్రవేత్తలను, ఇన్నోవేటర్స్‌ను ఈ సందర్భంగా ప్రధాని అభినందించారు.
సీరమ్ ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి ఇచ్చిందని, దీంతో ఆరోగ్యవంతమైన, కోవిడ్ రహిత భారత దేశానికి మార్గం సుగమమైందని హర్షం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌లు మన దేశంలోనే తయారు కావడం భారతీయులందరికీ గర్వకారణమని అన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో అసాధారణంగా కృషి చేసిన వైద్యులు, వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తలు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, కరోనా యోధులకు మరోసారి ధన్యవాదాలు చెప్పారు. ఎంతోమంది జీవితాలను కాపాడిన వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.