మీ సూచనలు బాగున్నాయి.. కేసీఆర్‌కు మోడీ అభినందనలు
దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సూచనలకు ప్రధాని మోడీ ఫిదా అయ్యారు. ‘టీకా ఉత్సవ్‘ (థర్డ్ ఫేజ్ వ్యాక్సినేషన్)లో భాగంగా 18-44 ఏళ్ళ వయస్కులకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడంలో ఏయే సెక్షన్ ప్రజలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలో కేసీఆర్ చేసిన సూచనలను ప్రధాని స్వీకరించి అభినందించారని, మంచి ఆలోచన అంటూ కితాబునిచ్చారని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ఆర్టీసీ కండక్టర్లు, వంట గ్యాస్ […]
దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సూచనలకు ప్రధాని మోడీ ఫిదా అయ్యారు. ‘టీకా ఉత్సవ్‘ (థర్డ్ ఫేజ్ వ్యాక్సినేషన్)లో భాగంగా 18-44 ఏళ్ళ వయస్కులకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడంలో ఏయే సెక్షన్ ప్రజలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలో కేసీఆర్ చేసిన సూచనలను ప్రధాని స్వీకరించి అభినందించారని, మంచి ఆలోచన అంటూ కితాబునిచ్చారని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ఆర్టీసీ కండక్టర్లు, వంట గ్యాస్ డెలివరీ బాయ్స్, స్ట్రీట్ వెండార్స్, అసంఘటిత కార్మికులు, వలస కార్మికులు.. తదితర వైరస్ వ్యాప్తికి కారకులుగా ఉండే ఈ సెక్షన్ ప్రజలకు తొలుత వ్యాక్సిన్ ఇవ్వాలని, ఆ మేరకు ‘ప్రత్యేక కేటగిరీ‘గా వీరిని గుర్తించాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ సూచించారు.
కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఈ విషయాన్ని ప్రధానికి వివరించిన వెంటనే స్వయంగా ఫోన్ చేసి కేసీఆర్‌ను అభినందించారని సీఎంఓ ఆ ప్రకటనలో పేర్కొంది. “మీది మంచి ఆలోచన. మీ సూచనలు చాలా బాగున్నాయి. వాటిని తప్పకుండా ఆచరణలో పెడుతాం. మీ సూచనలకు అభినందనలు” అంటూ ప్రధాని అభినందించారని పేర్కొంది. అంతేగాక, రాష్ట్రానికి మరింతగా ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని కూడా ప్రధానికి ఈ సందర్భంగా కేసీఆర్ విజ్జప్తి చేసినట్లు పేర్కొంది. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రధాని సత్వరమే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని వివరించింది.