లాక్‌డౌన్ పొడిగింపుతో పూజారి ఆత్మహత్య
ముంబై: లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణయంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ పూజారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కర్నాటకలోని ఉడిపి పట్టణానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి ముంబైలోని కుండివలీలోని దుర్గామాత దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ ఎత్తివేస్తే తన సొంతూరు ఉడిపి వెళ్లాలని అనుకున్నాడు. ఈ క్రమంలో మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్రం మంగళవారం నిర్ణయం తీసుకుంది. దీంతో తన సొంతూరికి వెళ్లడం కుదరలేదని మనస్తాపం చెందిన పూజారి.. తన ఇంట్లోనే […]
ముంబై: లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణయంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ పూజారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కర్నాటకలోని ఉడిపి పట్టణానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి ముంబైలోని కుండివలీలోని దుర్గామాత దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ ఎత్తివేస్తే తన సొంతూరు ఉడిపి వెళ్లాలని అనుకున్నాడు. ఈ క్రమంలో మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్రం మంగళవారం నిర్ణయం తీసుకుంది. దీంతో తన సొంతూరికి వెళ్లడం కుదరలేదని మనస్తాపం చెందిన పూజారి.. తన ఇంట్లోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టినట్టు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.
Tags: Priest suicide, mumbai, lockdown, udupi