హౌస్ నెంబర్ల ఆధారంగా ఇంటింటికో ధర
పురపాలికల్లో హౌస్ నంబర్ల ఆధారంగా, కాలనీలోని రోడ్లు, పక్క ఇండ్లను బట్టి ప్రభుత్వం ఇంటింటికో ధర నిర్ణయిస్తోంది. 2013లో నిర్ణయించిన రేట్ల ప్రకారమే ప్రస్తుతం మార్కెట్ విలువను ఖరారు చేస్తోంది. అతి త్వరలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఓపెన్ ప్లాట్లను మాత్రం ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పొందుపర్చడం లేదు. దీనిపై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదని అధికారులు వెల్లడిస్తున్నారు. దిశ, తెలంగాణ బ్యూరో : పురపాలికలు, గ్రామపంచాయితీలు తమ వద్ద నమోదై […]
పురపాలికల్లో హౌస్ నంబర్ల ఆధారంగా, కాలనీలోని రోడ్లు, పక్క ఇండ్లను బట్టి ప్రభుత్వం ఇంటింటికో ధర నిర్ణయిస్తోంది. 2013లో నిర్ణయించిన రేట్ల ప్రకారమే ప్రస్తుతం మార్కెట్ విలువను ఖరారు చేస్తోంది. అతి త్వరలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఓపెన్ ప్లాట్లను మాత్రం ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పొందుపర్చడం లేదు. దీనిపై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదని అధికారులు వెల్లడిస్తున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో : పురపాలికలు, గ్రామపంచాయితీలు తమ వద్ద నమోదై ఉన్న ఇంటి నంబర్ల మేరకు ఆ ఇళ్లకు అధికారులు మార్కెట్ విలువను ఖరారు చేస్తున్నారు. 2013లో భూములకు, ఫ్లాట్లకు నిర్ణయించిన మార్కెట్ విలువనే ప్రస్తుతం అమలులోకి తీసుకుంటున్నారు. 2014, 2015, 2016లో వరుసగా మూడుసార్లు మార్కెట్ విలువను రివైజ్డ్ ప్రక్రియను పూర్తిచేసి రిజిస్ట్రేషన్ విభాగం ప్రభుత్వానికి పంపినా మార్కెట్ విలువను పెంచలేదు. ప్రస్తుతం 2013లో నిర్ణయించిన ధరనే మార్కెట్ విలువగా పరిగణలోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆయా వార్డులు, బ్లాక్‌ల్లోకి వచ్చే ఇండ్లకు ధరలను చదరపు గజం ప్రకారం నిర్ణయిస్తున్నారు.
మున్సిపాలిటీల్లో ఇంటి నంబర్ లేకుంటే పక్క ఇంటి నంబర్ ఆధారంగా రేట్లు ఖరారు చేసి రిజిస్ట్రేషన్ చేయనున్నారు. అది కమర్షియల్ అయితే కమర్షియల్, నివాసమైతే నివాసం ధరను వేస్తారు. పక్క ఇల్లు కమర్షియల్ ఉండి రిజిస్ట్రేషన్ చేసుకునేది నివాసమైతే, ఆ పరిసరప్రాంతాల్లో నివాసాల విలువ ఎలా ఉంటే దానిని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని ఆఫీసర్లు వెల్లడిస్తున్నారు. జాతీయ, రాష్ట్రీయ రహదారులు వెంట ఉన్న నివాసాలైనా వ్యాపార కేటగిరీలోకి తీసుకుని విలువను నిర్ణయించి రిజిస్ట్రేషన్ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
ఓపెన్ ప్లాట్లకెప్పుడో?
ప్రస్తుతం ఇండ్లకు, ఇంటి నంబర్లున్నవాటిని మాత్రమే ఆన్‌లైన్‌లో పొందుపర్చుతున్నారు. ఖాళీ ప్లాట్లకు మాత్రం ఇంకా మార్కెట్ విలువను ఆన్‌లైన్‌లో పొందుపర్చడంలేదని, దానిపై ఇంకా స్పష్టత రాలేదని రిజిస్ట్రేషన్ అధికారులు వెల్లడిస్తున్నారు. గూగుల్ కోఆర్డినేట్‌లను తీసుకుని ఆ ప్లాట్లను ఆన్‌లైన్‌లో పొందుపర్చడం జరుగుతోందని, గూగుల్ కోఆర్డినేట్‌లు తీసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాల్సి వస్తుందని భావించిన ప్రభుత్వం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంటి నంబర్లకు మార్కెట్ విలువను జతపరుస్తోందని వారు వివరిస్తున్నారు.