ఓ మై గాడ్‌.. వారి మోకాళ్లు కనబడుతున్నాయి

దిశ, వెబ్ డెస్క్:గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి థీరత్‌ సింగ్‌ మహిళల వస్త్ర ధారణపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. మహిళలు రిప్పిడ్‌ జీన్స్ (చినిగిన జీన్స్‌) లాంటి వాటిని వేసుకొని సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు?, సమాజానికి ఉదాహరణగా నిలవాల్సిన వారి వస్త్రధారణ ఆందోళన కలిగిస్తుంది అని అన్న విషయం విదితమే. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై మహిళలు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలకు నిరసన గా ట్విట్టర్ లో రిప్పిడ్‌ జీన్స్‌ ధరించిన ఫోటోలను […]

Update: 2021-03-18 23:20 GMT

దిశ, వెబ్ డెస్క్:గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి థీరత్‌ సింగ్‌ మహిళల వస్త్ర ధారణపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. మహిళలు రిప్పిడ్‌ జీన్స్ (చినిగిన జీన్స్‌) లాంటి వాటిని వేసుకొని సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు?, సమాజానికి ఉదాహరణగా నిలవాల్సిన వారి వస్త్రధారణ ఆందోళన కలిగిస్తుంది అని అన్న విషయం విదితమే. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై మహిళలు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలకు నిరసన గా ట్విట్టర్ లో రిప్పిడ్‌ జీన్స్‌ ధరించిన ఫోటోలను షేర్‌ చేస్తూ.. తమ నిరసనను తెలుపుతున్నారు. ఇక వ్యాఖ్యలపై పలు మహిళా రాజకీయ నేతలు సైతం తమ గొంతును విప్పారు.

ఇక తాజాగా కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ సైతం తన నిరసనను ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేసారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్ లు ఆర్‌ఎస్‌ఎస్ యూనిఫామ్ ధరించి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ” ఓ మై గాడ్‌.. వారి మోకాళ్లు కనబడుతున్నాయి” అంటూ ట్వీట్ చేసింది. అబ్బాయిలు మోకాళ్ళపైన వరకు నిక్కర్లు వేసుకుంటే తప్పులేదుకాని, అమ్మాయిలు చిరిగిన జీన్స్ వేసుకుంటే తప్పు వచ్చిందా? అని కొందరు. మారాల్సింది మహిళలు కాదు.. మీ బుద్ధి ముఖ్యమంత్రి గారు అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags:    

Similar News