‘వైద్యుల రక్షణ’ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీ : వైద్యులపై దాడిని నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించి.. గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించాలన్న ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. కరోనా మహమ్మారితో పోరాడుతున్న వైద్యులపై దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్న తరుణంలో కేంద్ర క్యాబినెట్.. దాడులకు పాల్పడుతున్నవారిని కఠినంగా శిక్షించాలని మంగళవారం మధ్యాహ్నం ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897కు సవరణలు చేస్తూ వైద్యులపై దాడి చేసినవారికి మూడు నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50వేల […]

Update: 2020-04-23 05:00 GMT

న్యూఢిల్లీ : వైద్యులపై దాడిని నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించి.. గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించాలన్న ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. కరోనా మహమ్మారితో పోరాడుతున్న వైద్యులపై దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్న తరుణంలో కేంద్ర క్యాబినెట్.. దాడులకు పాల్పడుతున్నవారిని కఠినంగా శిక్షించాలని మంగళవారం మధ్యాహ్నం ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897కు సవరణలు చేస్తూ వైద్యులపై దాడి చేసినవారికి మూడు నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50వేల నుంచి రూ. ఐదు లక్షల వరకు జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ ఆర్డినెన్స్‌కు తాజాగా, బుధవారం రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

Tags: president, ordinance, cabinet, doctors, attack, punishment

Tags:    

Similar News