హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేయండి

దిశ, న్యూస్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ప్ర‌క‌టించిన హెల్త్ ప్రొఫైల్‌‌ను సాధ్య‌మైనంత త్వరగా చేప‌ట్టాల‌ని ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస్ రెడ్డి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కోరారు. హెల్త్ ప్రొఫైల్‌లో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్‌ తప్పకుండా ఉండేలా చూడాల‌న్నారు. బుధవారం శాస‌న మండ‌లి ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌కు హెల్త్ ప్రొఫైల్‌లో పలు సూచనలు చేశారు.గ్రామీణ ప్రాంతాల్లోని పేద‌ ప్రజలకు ఆరోగ్య స్థితిగతులపై అవ‌గాహ‌న లేక‌పోవ‌డం, వైద్యం అందుబాటులో లేక‌పోవ‌డంతో […]

Update: 2020-03-11 04:51 GMT

దిశ, న్యూస్ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం ప్ర‌క‌టించిన హెల్త్ ప్రొఫైల్‌‌ను సాధ్య‌మైనంత త్వరగా చేప‌ట్టాల‌ని ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస్ రెడ్డి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కోరారు. హెల్త్ ప్రొఫైల్‌లో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్‌ తప్పకుండా ఉండేలా చూడాల‌న్నారు. బుధవారం శాస‌న మండ‌లి ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌కు హెల్త్ ప్రొఫైల్‌లో పలు సూచనలు చేశారు.గ్రామీణ ప్రాంతాల్లోని పేద‌ ప్రజలకు ఆరోగ్య స్థితిగతులపై అవ‌గాహ‌న లేక‌పోవ‌డం, వైద్యం అందుబాటులో లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు త‌మ‌కున్నవ్యాధులు ఏమిటో కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో లేరన్నారు. ప్ర‌ధానంగా మ‌ధుమేహం, బీపీ వంటి వ్యాధుల‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ మ‌ధ్య కాలంలో వ‌రికోలు గ్రామంలో నిర్వ‌హించిన వైద్య శిబిరంలో 400 మందికి షుగ‌ర్, బీపీ ఉన్న‌ట్టు తేలింద‌న్నారు. అందులో 300 మందికి ఆ వ్యాధి వచ్చినట్టు కూడా తెలీదని సమాధానమిచ్చనట్టు తెలుస్తోంది. కావున వీలైనంత త్వరగా ప్ర‌భుత్వం హెల్త్ ప్రోఫైల్‌‌ను సిద్ధం చేయాల‌ని ఎమ్మెల్సీ కోరారు.

Tags: Health minister rajendra, mlc srinivas, village, new diseases, without knowing rural people

Tags:    

Similar News