కన్న కొడుక్కు ఊపిరాడనివ్వని తల్లి.. ఆపై ఆరో అంతస్తు నుంచి దూకి..!

దిశ, వెబ్‌డెస్క్ : ఓ గర్భిణీ మహిళ దారుణానికి ఒడిగట్టింది. కన్న కొడుకును కడతేర్చిన అనంతరం అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి ముందు ఆమె తల్లిదండ్రులకు కాల్ చేసి కొడుకును చంపిన విషయాన్ని వివరించడమే కాకుండా తన జీవితానికి ముగింపు పలకాలని అనుకుంటున్నట్టు చెప్పినట్టు సమాచారం. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రం సూర‌త్‌లోని కడోదర ప్రాంతంలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మహేశ్, బృందా (32) దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు […]

Update: 2021-08-20 07:07 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఓ గర్భిణీ మహిళ దారుణానికి ఒడిగట్టింది. కన్న కొడుకును కడతేర్చిన అనంతరం అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి ముందు ఆమె తల్లిదండ్రులకు కాల్ చేసి కొడుకును చంపిన విషయాన్ని వివరించడమే కాకుండా తన జీవితానికి ముగింపు పలకాలని అనుకుంటున్నట్టు చెప్పినట్టు సమాచారం. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రం సూర‌త్‌లోని కడోదర ప్రాంతంలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. మహేశ్, బృందా (32) దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు కలరు. భర్త ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే, ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన రెండున్నరేళ్ల కొడుకు కృష్ణను ఊపిరాడకుండా చేసి చంపిన బృందా తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో వారు నివాసముండే అపార్ట్ మెంట్‌లోని ఆరో అంతస్తు మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తాను చనిపోయే కొద్ది క్షణాల ముందు ముంబైలో ఉంటున్న తల్లిదండ్రులకు కాల్ చేసి తన జీవితాన్ని ముగిస్తున్నానని చెప్పినట్టు వారు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించగా ఊపిరాడక చనిపోయినట్టు కడోదర GIDC పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ KJ ధదుక్‌ నిర్దారించారు. అయితే, గర్భిణి మహిళ కుమారుడిని ఎందుకు చంపింది.. తాను ఎందుకు చనిపోవాలనుకుందో ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం కేసు విచారణలో ఉన్నట్టు ఇన్ స్పెక్టర్ తెలిపారు.

Tags:    

Similar News