ఎమ్మెల్సీ ఎన్నికలు: బ్రహ్మాస్త్రంగా మారిన పీఆర్సీ..!

దిశ, తెలంగాణ బ్యూరో: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సంఘాలే లక్ష్యంగా ప్రచారం సాగుతోంది. ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మరంగా ఓట్ల వేట సాగిస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుని, బీజేపీ స్థానానికి గండి కొట్టాలని టీఆర్ఎస్​ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. మంత్రులు హరీష్​రావు నేతృత్వంలో వ్యూహాలు అమలవుతున్నాయి. అటు వరంగల్​–ఖమ్మం–నల్గొండ స్థానంలో పల్లా రాజేశ్వర్​రెడ్డి కోసం పార్టీ శ్రేణులు చెమటొడ్చుతున్నాయి. మరోవైపు ఉద్యోగుల ఓట్ల కోసం టీఆర్ ఎస్ పీఆర్సీ ప్రకటన […]

Update: 2021-03-10 10:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సంఘాలే లక్ష్యంగా ప్రచారం సాగుతోంది. ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మరంగా ఓట్ల వేట సాగిస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుని, బీజేపీ స్థానానికి గండి కొట్టాలని టీఆర్ఎస్​ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. మంత్రులు హరీష్​రావు నేతృత్వంలో వ్యూహాలు అమలవుతున్నాయి. అటు వరంగల్​–ఖమ్మం–నల్గొండ స్థానంలో పల్లా రాజేశ్వర్​రెడ్డి కోసం పార్టీ శ్రేణులు చెమటొడ్చుతున్నాయి. మరోవైపు ఉద్యోగుల ఓట్ల కోసం టీఆర్ ఎస్ పీఆర్సీ ప్రకటన బ్రహ్మాస్త్రాన్ని వదలడంతో పార్టీ అభ్యర్థులు, శ్రేణుల్లో కొంత ఉత్సాహం పెరిగింది.

ముందుగా ఉద్యోగ సంఘాలు టార్గెట్

అధికార టీఆర్ ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్, జన సమితి వంటి పార్టీలన్నీ ప్రధానంగా ఉద్యోగ సంఘాలను టార్గెట్​గా పెట్టుకున్నాయి. దాదాపు ప్రధాన సంఘాలన్నీ టీఆర్​ఎస్​కు మద్దతు ఉంటున్నట్లు రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. అయితే జిల్లా స్థాయిల్లో మాత్రం కొంత తేడా కనిపిస్తోంది. అయితే వివిధ సంఘాలను కలిసి మద్దతు కూడగట్టడంతో టీఆర్‌ఎస్‌ ముందంజలో కనిపిస్తోంది. ఇక బీజేపీ అభ్యర్థులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రాంచందర్‌రావులు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తోన్న ఉద్యోగులు, ఇతర ఉపాధ్యాయ సంఘాల మద్దతుపై సమావేశమవుతున్నారు.

కాంగ్రెస్‌ అభ్యర్థులు రాములు నాయక్, చిన్నారెడ్డిలు కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలపైనే దృష్టి పెట్టాయి. నల్లగొండ స్థానం పరిధిలో లెఫ్ట్‌ అభ్యర్థి జయసారథిరెడ్డి పక్షాన వామపక్ష అనుబంధ సంఘాలన్నీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. రంగారెడ్డి స్థానంలో లెఫ్ట్‌ పార్టీలకు అనుబంధంగా ఉండే ప్రజాసంఘాలు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్‌. కె.నాగేశ్వర్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి. కొన్ని బీసీ సంఘాలు, ఎమ్మార్పీఎస్, ఇతర కుల సంఘాలు తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థి డాక్టర్‌. చెరుకు సుధాకర్‌కు మద్దతు తెలిపాయి.

భారీ అంచనాలు..

ప్రస్తుతం మండలి పోరులో నిలిచి అభ్యర్థులందరూ ఎవరి అంచనాలు వారే వేసుకుంటున్నారు. పీఆర్సీ ఆయుధంతో టీఆర్ఎస్ గెలుపుపై ధీమా పెట్టుకుంటోంది. కానీ అదే అంశం తమకు అనుకూలంగా మారుతుందనే బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్‎కు కూడా అదే ఆశ. ఎందుకంటే ఇప్పటి వరకు పీఆర్సీపై ప్రభుత్వం మభ్య పెడుతుందనే ప్రచారాన్ని మరింత విస్తృతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags:    

Similar News