ఆరోగ్యసేతులో ఆ అవకాశం లేదా? : ప్రతీక్ గాంధీ

దిశ, సినిమా : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్‌ దృష్ట్యా ఆందోళనకర పరిస్థితులు తలెత్తగా.. హాస్పిటళ్లలో ఆక్సిజన్, బెడ్ల కొరతతో పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు కొవిడ్ సంబంధిత సహాయ కార్యక్రమాలు చేస్తూ, సోషల్ మీడియాలో యూజ్‌ఫుల్ ఇన్‌ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రతీక్ గాంధీ.. ట్విట్టర్ వేదికగా విలువైన సలహా షేర్ చేశాడు. #aarogyasetu యాప్‌లో బెడ్స్, మెడిసిన్స్ లభ్యత […]

Update: 2021-05-16 02:40 GMT

దిశ, సినిమా : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్‌ దృష్ట్యా ఆందోళనకర పరిస్థితులు తలెత్తగా.. హాస్పిటళ్లలో ఆక్సిజన్, బెడ్ల కొరతతో పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు కొవిడ్ సంబంధిత సహాయ కార్యక్రమాలు చేస్తూ, సోషల్ మీడియాలో యూజ్‌ఫుల్ ఇన్‌ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రతీక్ గాంధీ.. ట్విట్టర్ వేదికగా విలువైన సలహా షేర్ చేశాడు. #aarogyasetu యాప్‌లో బెడ్స్, మెడిసిన్స్ లభ్యత గురించి సిటీ వైజ్ అప్‌డేట్స్ ఇవ్వడం ప్రాక్టికల్‌గా సాధ్యపడదా? అని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీని ప్రశ్నించాడు. దేశంలో అత్యధికమంది డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌ను ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు మరింత యూజ్‌పుల్‌గా మార్చాలని కోరాడు. అయితే ప్రస్తుత సమస్యకు ఇది కొంతవరకు సొల్యూషన్ కాగలదని సూచిస్తున్నానే తప్ప ఎవరినీ నిందించడం లేదని ట్వీట్‌లో పేర్కొన్నాడు. కాగా గతేడాది సోనీ లివ్‌లో ప్రసారమైన బయోగ్రాఫికల్ సిరీస్ ‘స్కామ్ 1992’లో అర్షద్ మెహతా రోల్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రతీక్.

Tags:    

Similar News