బిగ్ బ్రేకింగ్: రాహుల్ గాంధీతో పీకే కీలక భేటీ
దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్ళిన పీకే చాలా సేపు చర్చలు జరిపారు. తాజా రాజకీయాల గురించి, పార్టీల మధ్య పొత్తులు, సంబంధాల గురించి చర్చించినట్లు తెలిసింది. రాహుల్ గాంధీతో పీకే చర్చలు జరిపే సమయంలో ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, హరీశ్ రావత్ తదితరులు కూడా ఉన్నారు. వ్యూహకర్తగా ఇకపైన పనిచేయను అని పశ్చిమబెంగాల్ […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్ళిన పీకే చాలా సేపు చర్చలు జరిపారు. తాజా రాజకీయాల గురించి, పార్టీల మధ్య పొత్తులు, సంబంధాల గురించి చర్చించినట్లు తెలిసింది. రాహుల్ గాంధీతో పీకే చర్చలు జరిపే సమయంలో ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, హరీశ్ రావత్ తదితరులు కూడా ఉన్నారు. వ్యూహకర్తగా ఇకపైన పనిచేయను అని పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం స్పష్టంగా చెప్పిన పీకే ఇప్పుడు హఠాత్తుగా ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటికి వెళ్ళి సుదీర్ఘంగా చర్చలు జరపడం రాజకీయ వర్గాల్లో సెన్సేషన్ గా నిలుస్తోంది.
తాజాగా ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల నాడి ఎలా ఉంది, వచ్చే ఏడాది జరిగే మరికొన్ని రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా రాబోతున్నాయి, ఆ ప్రభావం 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎలా ఉండబోతున్నది తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కోసం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా.. వ్యూహకర్తగా పనిచేయనున్నారో లేదో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఈ చర్చకు మాత్రం భారీ స్థాయిలోనే రాజకీయ ప్రాధాన్యత ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.