దుర్ఘటనలను పునరావృతం కానివ్వం
దిశ, న్యూస్‌బ్యూరో: విద్యుత్ ఉద్యోగుల భద్రతకు మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటామని, శ్రీశైలం ప్లాంటులో జరిగిన అగ్ని ప్రమాదం లాంటి దుర్ఘటనలను పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని జెన్‌కో, ట్రాన్స్‌కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. ఉద్యోగులు ఏమాత్రం అభద్రతా భావానికి లోనుకాకుండా మరింత అంకితభావంతో పనిచేసి, తెలంగాణ ప్రజలు తమపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ఇటీవల అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రాన్ని బుధవారం […]
దిశ, న్యూస్‌బ్యూరో: విద్యుత్ ఉద్యోగుల భద్రతకు మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటామని, శ్రీశైలం ప్లాంటులో జరిగిన అగ్ని ప్రమాదం లాంటి దుర్ఘటనలను పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని జెన్‌కో, ట్రాన్స్‌కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. ఉద్యోగులు ఏమాత్రం అభద్రతా భావానికి లోనుకాకుండా మరింత అంకితభావంతో పనిచేసి, తెలంగాణ ప్రజలు తమపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ఇటీవల అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రాన్ని బుధవారం ప్రభాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వీస్ బే, ఆరు యూనిట్ల జనరేటర్లు, కంట్రోల్ ప్యానెల్స్, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇండోర్‌గ్యాస్ సబ్ స్టేషన్, మెయిన్ కంట్రోల్ రూములను ఆయన తనిఖీ చేశారు. అక్కడ అగ్ని ప్రమాద ప్రభావానికి గురైన పరికరాలను, ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆరవ యూనిట్‌లో ప్రారంభమయిన మంటలు మిగతా యూనిట్లకు వ్యాపించాయని, నాల్గో యూనిట్ పూర్తిగా కాలిపోయినట్లు ఆయన గమనించారు.