భీమ్లా నాయక్‌ అప్డేట్: యుద్ధానికి సిద్ధమైన డానీ

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటిస్తోన్న చిత్రం భీమ్లానాయక్. యువ దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నాడు. అంతేగాకుండా.. ఎస్ఎస్ థమన్ భీమ్లానాయక్‌కు సంగీతం అందిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్‌పై సూర్యాదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి పవన్ ఫస్ట్ లుక్‌తో పాటు పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా టైటిల్ సాంగ్ విడుదల చేసి రికార్డులు […]

Update: 2021-09-17 06:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటిస్తోన్న చిత్రం భీమ్లానాయక్. యువ దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నాడు. అంతేగాకుండా.. ఎస్ఎస్ థమన్ భీమ్లానాయక్‌కు సంగీతం అందిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్‌పై సూర్యాదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి పవన్ ఫస్ట్ లుక్‌తో పాటు పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా టైటిల్ సాంగ్ విడుదల చేసి రికార్డులు సృష్టించారు.

ఇక.. ఈ చిత్రం నుంచి అందరూ రానా దగ్గుబాటి అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తుండగా.. తాజాగా ఆయనకు సంబందించిన అప్డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘బ్లిట్జ్ ఆఫ్ డానియెల్ శేఖర్’ ప్రోమోను ఈనెల 20న విడుదల చేయబోతున్నట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రానా వెనకవైపు నుంచి కనిపిస్తోండగా.. పంచె చేతపట్టుకొని భీమ్లా నాయక్‌తో యుద్ధానికి రెడీ అనే లాగా ఉన్న పోస్టర్ ప్రేక్షకులకు కిక్ ఇస్తోంది. పవన్ సరసన నిత్యామీనన్, రానా జంటగా ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News