ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఎస్ఈసీ కనగరాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గతంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత మార్చిలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఆరు వారాలపాటు అంటే ఏప్రిల్ 31 వరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తదనంతర పరిణామాల్లో ఎస్ఈసీ మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ కనగరాజ్… కోర్టులో కేసు ఉండడంతో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత […]
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఎస్ఈసీ కనగరాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గతంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత మార్చిలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఆరు వారాలపాటు అంటే ఏప్రిల్ 31 వరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తదనంతర పరిణామాల్లో ఎస్ఈసీ మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ కనగరాజ్… కోర్టులో కేసు ఉండడంతో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచే ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
tags: ap, sec, kanagaraj, local body elections