కేసీఆర్ నీ ఆటలు ఇక సాగవు.. గాదె ఇన్నారెడ్డి వార్నింగ్

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : తెలంగాణ ఉద్యమ స‌మ‌యంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీల‌ను తిరిగి ఆయ‌న‌కు గుర్తు చేసేందుకే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక ఆవిర్భవించింద‌ని ఉద్యమ నాయ‌కుడు గాదె ఇన్నారెడ్డి అన్నారు. శ‌నివారం గాదె ఇన్నారెడ్డి అధ్యక్షత‌న హ‌రిత‌హోట‌ల్‌లో అఖిలప‌క్ష నేత‌ల‌తో క‌లిసి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక ఉద్దేశాన్ని మీడియాకు వెల్లడించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌ ఉద్యమ ఆకాంక్షల వేదిక గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంత‌రం నేత‌లు భ‌విష్యత్ కార్యాచ‌ర‌ణ‌, వేదిక ల‌క్ష్యాల‌ను వివ‌రించారు. […]

Update: 2021-07-17 07:21 GMT

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : తెలంగాణ ఉద్యమ స‌మ‌యంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీల‌ను తిరిగి ఆయ‌న‌కు గుర్తు చేసేందుకే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక ఆవిర్భవించింద‌ని ఉద్యమ నాయ‌కుడు గాదె ఇన్నారెడ్డి అన్నారు. శ‌నివారం గాదె ఇన్నారెడ్డి అధ్యక్షత‌న హ‌రిత‌హోట‌ల్‌లో అఖిలప‌క్ష నేత‌ల‌తో క‌లిసి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక ఉద్దేశాన్ని మీడియాకు వెల్లడించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌ ఉద్యమ ఆకాంక్షల వేదిక గోడ పత్రికను ఆవిష్కరించారు.

అనంత‌రం నేత‌లు భ‌విష్యత్ కార్యాచ‌ర‌ణ‌, వేదిక ల‌క్ష్యాల‌ను వివ‌రించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వ‌రంగ‌ల్ అర్బన్, రూర‌ల్‌ జిల్లాల‌ అధ్యక్షుడు నాయిని రాజేంద‌ర్‌రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నేత, మాజీ మంత్రి డాక్టర్ విజ‌య‌రామారావు, బీజేపీ రాష్ట్ర నేత వేణుగోపాల్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గాదె ఇన్నారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక‌లో రాజ‌కీయ పార్టీల‌కు అతీతంగా పోరాటాలు నిర్మించేందుకు ప్రణాళిక చేస్తున్నట్లుగా తెలిపారు. జెండాలు ప‌క్కన పెట్టి పోరాడాల‌ని ఆయ‌న నాయ‌కుల‌కు పిలుపునిచ్చారు. ఈనెల 19న ఉద్యమ ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో ఉద్యమ శ‌క్తుల‌న్నింటితో స‌ద‌స్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

అంత‌కుముందు డీసీసీ అధ్యక్షుడు నాయిని మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స‌మ‌యంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ నెర‌వేర్చలేక‌పోయార‌ని అన్నారు. ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌కుండా తెలంగాణ యువ‌త‌కు తీర‌ని అన్యాయం చేస్తున్నాడ‌ని వాపోయారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన 7సంవ‌త్సరాల త‌ర్వాత కూడా ఉద్యమ ఆకాంక్షల కోసం పోరాటం నిజంగా దౌర్భాగ్యమ‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు.

ఉద్యమంలో కేసీఆర్ ఇచ్చిన అనేక హామీలైన ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి, ద‌ళితుడిని సీఎం చేస్తాన‌ని చెప్పడం, యువ‌త‌కు ల‌క్ష ఉద్యోగాలు క‌ల్పిస్తాన‌ని చెప్పి తెలంగాణ ప్రజ‌ల‌ను మోసం చేశాడ‌ని అన్నారు. ప్రభుత్వంలో, రాజ్యాధికారంలో వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు క‌నీస ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని అన్నారు. బీజేపీ రాష్ట్ర నేత వేణు గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో నియంత పాల‌న కొన‌సాగుతోంద‌ని అన్నారు. ప్రశ్నించే వ్యక్తుల గొంతు నొక్కుతున్నార‌ని, అయితే తెలంగాణ ప్రజానీకంలో కొట్లాడే త‌త్వం ఉంటుంద‌ని ఆ విష‌యం క‌ల్వకుంట్ల కుటుంబం మ‌రిచిపోవ‌ద్దని హెచ్చరించారు.

Tags:    

Similar News