ఈ నెలాఖరులో వ్యాక్సిన్ మొదటి దశ ఫలితాలు

లండన్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వణికిపోతున్న ప్రపంచానికి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. ఆ యూనివర్సిటీ తయారు చేస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలపై గురువారం ప్రకటన చేయనున్నది. ప్రపంచంలో కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీ‌లో ఎంతో ముందున్న ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఇప్పటికే మూడో దశ ట్రయల్స్‌ను ప్రారంభించింది. పెద్ద ఎత్తున మనుషులపై ప్రయోగాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆక్స్‌ఫర్డ్ ప్రతినిధులు మాట్లాడుతూ ఇప్పటివరకు నిర్వహించిన క్రినికల్ ట్రయల్స్‌లో […]

Update: 2020-07-16 04:27 GMT

లండన్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వణికిపోతున్న ప్రపంచానికి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. ఆ యూనివర్సిటీ తయారు చేస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలపై గురువారం ప్రకటన చేయనున్నది. ప్రపంచంలో కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీ‌లో ఎంతో ముందున్న ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఇప్పటికే మూడో దశ ట్రయల్స్‌ను ప్రారంభించింది. పెద్ద ఎత్తున మనుషులపై ప్రయోగాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆక్స్‌ఫర్డ్ ప్రతినిధులు మాట్లాడుతూ ఇప్పటివరకు నిర్వహించిన క్రినికల్ ట్రయల్స్‌లో వ్యాక్సిన్ ఇమ్యూనిటీని విజయవంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు గుర్తించాం. ఈ నెలాఖరు లోపు మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను మెడికల్ మ్యాగజైన్‌లో ప్రచురించనున్నట్లు తెలిపారు. ప్రఖ్యాతిగాంచిన లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో క్లినికల్ ట్రయల్స్ ప్రచురించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

కొవిడ్-19 మహమ్మారి కారణంగా లక్షల మంది మృతిచెందగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్లింది. ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయడం కోసం ప్రపంచ వ్యాప్తంగా 100కుపై వ్యాక్సిన్లు అభివృద్ధి, క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. ఇందులో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఎంతో ముందంజలో ఉన్నది. ఈ వ్యాక్సిన్ అభివృద్ధిలో ఎంతో ముందుందని జూన్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ శాస్త్రవేత్త తెలిపారు. అన్నీ అనుకునట్లు జరిగితే వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరా చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలతో సంబంధిత కంపెనీ ఒప్పందాలను కూడా చేసుకున్నది.

సైన్స్ జర్నల్‌లో మొదటి దశ ప్రయోగానికి సంబంధించి డేటా ప్రచురించే సమయం, రోజు కోసం మా బృందం ఎదురు చూస్తున్నది. కానీ, డేటా ఎప్పుడు విడుదలవుతుందో కచ్చితమైన సమాచారం తమ వద్ద లేదని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అధికార ప్రతినిధి రైటర్స్‌కు తెలిపారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ మొదటి దశ ప్రయోగ ఫలితాల గురించి శుభవార్త విన్నా అని పెస్టన్ తన బ్లాగ్‌లో పేర్కొంది.

మరోవైపు అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీ మెడర్నా ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ అభివృద్ధిపై మంగళవారం ఓ ప్రకటన చేసింది. ‘మొదటి దశలో 45 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాం. ప్రస్తుతం వారు ఆరోగ్యంగా ఉన్నారు. అంతేకాకుండా, వ్యాక్సిన్ ఇమ్యూనిటీని విజయవంతంగా పెంచిందని, సురక్షితమని కూడా తేలంది’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. మెడర్నా మే నెలలో రెండో దశ క్లినికల్ ట్రయల్స్ కూడా ప్రారంభించింది. ఈ నెల 27 నుంచి మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నది.

Tags:    

Similar News