పోర్నోగ్రఫీ సమాజానికి ప్రమాదం: కేంద్రమంత్రి

           పోర్నోగ్రఫీ సమాజానికి ప్రమాదమనీ, దానిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. నకిలీ వార్తలను, చైల్డ్ పోర్నోగ్రఫీని కనిపెట్టడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది.. తీసుకుంటే ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయో వెల్లడించాలని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు రవిశంకర్ స్పందిస్తూ.. అశ్లీల చిత్రాలను అరికట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చైల్డ్ పోర్నోగ్రఫీ సమాజానికి […]

Update: 2020-02-05 06:55 GMT

పోర్నోగ్రఫీ సమాజానికి ప్రమాదమనీ, దానిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. నకిలీ వార్తలను, చైల్డ్ పోర్నోగ్రఫీని కనిపెట్టడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది.. తీసుకుంటే ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయో వెల్లడించాలని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు రవిశంకర్ స్పందిస్తూ.. అశ్లీల చిత్రాలను అరికట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చైల్డ్ పోర్నోగ్రఫీ సమాజానికి అత్యంత ప్రమాదమని హెచ్చరించారు. తాము దీనిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పోలీసులూ దీని నిర్మూలనకు కృషి చేస్తున్నారని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో చైల్డ్ పోర్నోగ్రఫీ, అసభ్య అంశాలను పోస్ట్ చేసిన వారిపైనా అనేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. అయినప్పటికీ దేశంలో రివేంజ్ పోర్నోగ్రఫీ(అనుమతి లేకుండానే ఇతరుల వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడం) పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని పూర్తి స్థాయిలో అరికట్టాలంటే అన్ని రాజకీయ పార్టీలతో పాటు, సమాజంకూడా భాగస్వామ్యం కావాలని అన్నారు.

Tags:    

Similar News