TG Assembly: ధరణి ఓ దుర్మార్గమైన చట్టం.. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి ఫైర్
తెలంగాణ ఆసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఇవాళ సభలో ధరణి (Dharani), భూభారతి (Bhubharati)పై బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సాయుధ పోరాట స్ఫూర్తితోనే కాంగ్రెస్ (Congress) భూములపై హక్కులు కల్పిస్తూ వస్తోందని అన్నారు. దున్నే వాడిదే భూమి కదా.. సాయుధ పోరాట నినాదమని విపక్ష సభ్యులను ప్రశ్నించారు. ఒక్క కలం పోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గమైన చట్టమే ధరణి (Dharani) అంటూ మండిపడ్డారు. అందుకే ధరణిని బంగాళాఖాతం (Bay Of Bengal)లో వేస్తామని చెప్పామని అన్నారు. అనేక చట్టాలు, పోరాటాల ద్వారా వచ్చిన హక్కులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) కాలరాసిందని కామెంట్ చేశారు. ధరణిని బంగాళాఖాతంలో వేయాలనే ప్రజలు మాకు అధికారాన్ని కట్టబెట్టారని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు.