CM YOGI: ముస్లింలు ప్రమాదంలో ఉన్నారన్న అసదుద్దీన్ ఒవైసీ.. సీఎం యోగి కౌంటర్

ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారతదేశంలో ఉన్న ముస్లిం ప్రజలు ప్రమాదంలో ఉన్నారని వారిపై దాడుదుల జరుగుతున్నాయని ఒవైసీ తీవ్ర ఆరోపణలు చేశారు.

Update: 2025-03-26 06:01 GMT
CM YOGI: ముస్లింలు ప్రమాదంలో ఉన్నారన్న అసదుద్దీన్ ఒవైసీ.. సీఎం యోగి కౌంటర్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) చేసిన వ్యాఖ్యలకు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) స్ట్రాంగ్ కౌంటర్ (Strong Counter) ఇచ్చారు. భారతదేశంలో ఉన్న ముస్లిం ప్రజలు ప్రమాదంలో ఉన్నారని వారిపై దాడుదుల జరుగుతున్నాయని ఒవైసీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై సీఎం యోగి మాట్లాడుతూ.. "ముస్లింలు ప్రమాదంలో లేరు. ప్రస్తుతం దేశంలో వారి ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రమాదంలో ఉన్నాయన్నారు. అలాగే బీజేపీ ప్రభుత్వం అన్ని మతాల పట్ల సమాన దృక్పథాన్ని కలిగి ఉందని, రాష్ట్రంలో శాంతి, సామరస్యాన్ని కాపాడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఒవైసీ (Owaisi) లాంటి నాయకులు రాజకీయ లబ్ధి (Political gain) కోసం ఇటువంటి ఆరోపణలు చేస్తూ సమాజంలో విభేదాలను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో చట్టం, శాంతిభద్రతలు కఠినంగా అమలు చేయబడుతున్నాయని, ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భారతదేశం ఒక సెక్యులర్ (Secular) దేశమని, ఇక్కడ ప్రతి పౌరుని హక్కులు రాజ్యాంగం (Constitution) ద్వారా రక్షించబడతాయని గుర్తు చేశారు. ఒవైసీ ఆరోపణల (Owaisi's allegations)ను ఆధారసహితంగా అభివర్ణిస్తూ, దేశంలో ముస్లిం సమాజం అభివృద్ధి పథంలో భాగస్వామ్యం వహిస్తోందని, వారికి ఎటువంటి ఇబ్బంది లేదని అన్నారు. అలాగే భారతీయ ముస్లింలు తమ పూర్వీకులను అర్థం చేసుకున్న రోజు.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే వారు.. తమ సంచులను సర్దుకుని వెళ్ళిపోవాల్సి ఉంటుంది. దేశంలో హిందువులు, వారి సంప్రదాయాలు సురక్షితంగా ఉన్నప్పుడు తాము సురక్షితంగా ఉన్నామని భారతీయ ముస్లింలు (Indian Muslims) గుర్తుంచుకోవాలని అన్నారు. 1947 కి ముందు.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ భారతదేశంలో భాగంగా ఉండేవి. మనం ఈ సత్యాన్ని ఎలా మర్చిపోగలం? బంగ్లాదేశ్‌లో మాతా ధాకేశ్వరి ఆలయం లేదా? అని ఈ సందర్భంగా సీఎం యోగీ ప్రశ్నించారు.

Similar News