కరోనా తో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి కొన్ని వేల సంఖ్యలో జనం మరణిస్తుండగా… లక్షల మంది ఈ వ్యాధి సోకి బాధపడుతున్నారు. ఎలాగైనా ఈ వైరస్ నుంచి ప్రజలను కాపాడుకోవాలని దేశాలన్నీ తమ తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. లాక్ డౌన్ ప్రకటించి… ప్రజలను ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నాయి. వైద్య నిపుణులు చెప్పిన సూచనలు పాటించాలని కోరుతున్నాయి. అయినా కూడా కరోనా విజృంభణ ఆగడం లేదు. తాజాగా గ్రామీ అవార్డ్ విన్నర్ , అమెరికాకు […]

Update: 2020-03-30 22:23 GMT

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి కొన్ని వేల సంఖ్యలో జనం మరణిస్తుండగా… లక్షల మంది ఈ వ్యాధి సోకి బాధపడుతున్నారు. ఎలాగైనా ఈ వైరస్ నుంచి ప్రజలను కాపాడుకోవాలని దేశాలన్నీ తమ తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. లాక్ డౌన్ ప్రకటించి… ప్రజలను ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నాయి. వైద్య నిపుణులు చెప్పిన సూచనలు పాటించాలని కోరుతున్నాయి. అయినా కూడా కరోనా విజృంభణ ఆగడం లేదు. తాజాగా గ్రామీ అవార్డ్ విన్నర్ , అమెరికాకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు జో డిఫీ ని పొట్టన పెట్టుకుంది కరోనా. 61 ఏళ్ల జో … తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సోషల్ మీడియా అఫిషియల్ పేజ్ లో ప్రకటించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కానీ రెండు రోజుల్లోనే ఈ వ్యాధి కారణంగా మృతి చెందారు. ఈ విషయాన్ని కుటుంబీకులు జో డిఫి సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించారు. దీంతో అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

Tags: Joe Diffie, Singer, CoronaVirus, Covid19

Tags:    

Similar News