థియెరా.. మనసులు గెలిచాడు
దిశ, వెబ్‌డెస్క్: అనుకున్నది సాధించాలంటే, కసి, పట్టుదల, నిండైన ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆ పిల్లోడిలో అవన్నీ ఉన్నాయి. ఆ బాలుడి ఆత్మస్థైర్యం చూస్తే నిజంగానే మనలోనూ స్ఫూర్తి రగులుతోంది. ఆ బాలుడి ప్రయత్నాన్ని చూస్తే.. ఇది కదా సంకల్పమంటే అని అనిపించక మానదు. కంబోడియాలో జరిగిన ఓ సైక్లింగ్‌లో ఈవెంట్‌లో అందర్నీ ఆకర్షించిన ఆ బాలుడెవరు? ఇంతకీ ఆ బాలుడు ఏం చేశాడు? అదో సైకిల్ రేస్. ఓ పిల్లోడు అందరితో పోటీ పడుతున్నాడు. ఫొటోగ్రాఫర్లంతా అతడిని […]
దిశ, వెబ్‌డెస్క్: అనుకున్నది సాధించాలంటే, కసి, పట్టుదల, నిండైన ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆ పిల్లోడిలో అవన్నీ ఉన్నాయి. ఆ బాలుడి ఆత్మస్థైర్యం చూస్తే నిజంగానే మనలోనూ స్ఫూర్తి రగులుతోంది. ఆ బాలుడి ప్రయత్నాన్ని చూస్తే.. ఇది కదా సంకల్పమంటే అని అనిపించక మానదు. కంబోడియాలో జరిగిన ఓ సైక్లింగ్‌లో ఈవెంట్‌లో అందర్నీ ఆకర్షించిన ఆ బాలుడెవరు? ఇంతకీ ఆ బాలుడు ఏం చేశాడు?
అదో సైకిల్ రేస్. ఓ పిల్లోడు అందరితో పోటీ పడుతున్నాడు. ఫొటోగ్రాఫర్లంతా అతడిని ఫొటోలు తీయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అక్కడున్న జనమంతా, ఆ కుర్రాడిని బాగా ప్రోత్సహిస్తున్నారు. రేసుగుర్రాల్లాంటి సైకిళ్ల మధ్యలో అతడి సైకిల్ ఎంతో పాతది. అతడి తలకు హెల్మెట్ లేదు, కళ్లకు సైక్లింగ్ గ్లాసెస్ లేవు. కాళ్లకు షూ లేవు. సైక్లింగ్ జెర్సీ, పాడెడ్ సైక్లింగ్ షార్ట్ ఇవేవీ లేవు. కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. గెలవాలన్నా కసి, పట్టుదల మెండుగా ఉన్నాయి. అందుకే అతడు చాలా స్పెషల్‌గా, ఒకరకంగా చెప్పాలంటే.. రియల్ హీరోలా అక్కడి వారికి కనిపించాడు. ఆ కుర్రాడే కంబోడియాకు చెందిన పిచ్ థియెరా.
థియెరా ఆ సైక్లింగ్ ఈవెంట్‌లో విజేతగా నిలవలేడు. కానీ అందరి మనసుల గెలిచాడు. సోషల్ మీడియాలో థియెరాపై ప్రశంసలు వర్షం కురిసింది. ఆన్‌లైన్ వేదికగా ఆ కుర్రాడి ఆత్మవిశ్వాసాన్ని ఆకాశానికెత్తేశారు. ఆ కుర్రాడి వివరాలు తెలుసుకుని సాయం చేసేందుకు ఎంతోమంది ముందుకు వచ్చారు. అందులో లాంగ్ టైలీంగ్ ఒకరు. థియెరాను పర్సనల్‌గా కలిసి, బ్రాండ్ న్యూ సైకిల్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ‘అతడి హార్డ్‌వర్క్, గుడ్ యాటిట్యూడ్ మెచ్చి నేను ఆ కుర్రాడికి సైకిల్ గిఫ్ట్‌గా ఇచ్చాను’ అని లాంగ్ తెలిపాడు. లాంగ్ ఒక్కడే కాదు, కొంతమంది షూ, బట్టలు, బుక్స్, మనీ గిఫ్ట్స్‌గా థియెరాకు అందించారు.